The Legend of Hanuman : ఈ దీపావళికి ఫ్యామిలీ ప్రేక్షకులను ముఖ్యంగా పిల్లలను అలరించేందుకు ఫేమస్ ది లెజెండ్ ఆఫ్ హనుమాన్(The Legend of Hanuman) సిరీస్‌లో 5వ సీజన్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇప్పటికే నాలుగు సీజన్‌లుగా వచ్చిన ఈ మూవీ ఒకదాన్ని మించి ఒకటి మంచి ఆదరణను దక్కించుకున్నాయి. పిల్లలు బాగా ఇష్టపడి చూసే ఈ సిరీస్‌లో మనం ఒక్క పార్ట్ చూసినా సీజన్‌లు మొత్తం పూర్తిగా చూసేలా చేయడం దీనికున్న ప్రత్యేకత. ఈ సిరీస్‌లో రామాయణంలో ఇప్పటివరకు మనకు తెలియని చాలా విషయాలను, విశేషాలను కండ్లకు కట్టినట్టుగా చూపించడమే కాక మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం.
The Legend of Hanuman Series Update..
అయినప్పటికీ ఈ సిరీస్‌కున్న క్రేజ్, రేంజ్ మరో లెవల్‌లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంతలా ఇది జనంలోకి చొచ్చుకు పోయింది. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ పేరిట వస్తున్న ఈ సిరీస్‌లో ఇప్పటికే మొదటిభాగం 2021 జనవరి 29,రెండో భాగం జూలై 27న స్ట్రీమింగ్ అవగా రెండు, మూడు నెలల తర్వాత అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆడియోల్లోను తీసుకు వచ్చారు. దీంతో ఈ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మళ్లీ మూడేండ్ల తర్వాత మూడవ సీజన్‌ను ఈ ఏడాది జనవరి 12న, 4 వ సీజన్ జూన్5 నుంచి జూలై 11మధ్య స్ట్రీమింగ్‌కు రాగా 5వ నూతన సీజన్ శుక్రవారం (ఆక్టోబర్ 25) నుంచి ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ప్రస్తుతం ఒక్కొక్కటి 20 నిమిషాల చొప్పున 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్‌లో హనుమంతుడు లంకలో అడుగుపెట్టి రావణ సైన్యంతో పోరాడడం, రావణుడి కొడుకులను మట్టి కరిపించడం, హనుమంతుడు లంకలో చేసిన పనులు, రామ రావణ యుద్ధాలను తాజా సీజన్‌లో చూపించనున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పటివరకు చూడని వారు, చూసిన వారు ఇంటిల్లిపాది కుటుంబ సమేతంగా ఈ వీకెండ్ చూసి ఆస్వాదించండి.
Also Read : Ka Movie : కిరణ్ సబ్బవరం ‘క’ సినిమా ట్రైలర్ పై భారీ అంచనాలు