The Kerala Story: ఓటీటీలోకి వివాదాస్పద సినిమా ‘ద కేరళ స్టోరీ’ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ఓటీటీలోకి వివాదాస్పద సినిమా 'ద కేరళ స్టోరీ' ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

The Kerala Story: సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై సుదీప్తో సేన్ దర్శకత్వంలో అదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా ‘ద కేరళ స్టోరీ’. కేరళకు చెందిన ముగ్గురు యువతులను ప్రేమపేరుతో మభ్యపెట్టి ఇస్లాం మతంలోకి మార్చి… చివరకు విదేశాలకు తీసుకెళ్ళి తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) లో చేర్చడం కథాంశంగా తెరకెక్కించిన ఈ సినిమా… “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమా తరహాలో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది వేసవిలో విడుదలై రూ. 300 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది.

అయితే థియేటర్ రిలీజ్‌ కి ముందే డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం జీ5… కాంట్రవర్సీ కారణమో ఏమో గాని స్ట్రీమింగ్ డేట్ ను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు… ఒక్కసారిగా జీ5 సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు ‘ద కేరళ స్టోరీ’ సినిమా ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

The Kerala Story Updates

గతేడాది వేసవిలో థియేటర్లలోకి వచ్చిన ‘ద కేరళ స్టోరీ(The Kerala Story)’ పలు వివాదాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు స్ట్రీమింగ్ తేదీని డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం జీ5 అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీనితో ‘ద కేరళ స్టోరీ’ లవర్స్ ఎగ్జైట్ అయిపోతున్నారు. నెక్స్ట్ వీకెండ్‌లో పక్కా చూసేయాలని ప్లాన్ వేసుకుంటున్నారు.

సన్‍షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్‍లాల్ షా నిర్మించిన సినిమా ‘ద కేరళ స్టోరీ’. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన అదాశర్మతో పాటు యోగితా బిహానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ద కేరళ స్టోరీ’ సినిమా కథ విషయానికొస్తే.. ముగ్గురు అమ్మాయిలు షాలినీ (అదా శర్మ), నిమాహ్ (యోగితా బిహానీ), ఆసిఫా (సోనియా బలానీ) లను ప్రేమ పేరుతో ముగ్గురిని మభ్యపెట్టి… ఇస్లాం మతంలోకి మార్చి విదేశాలకు తీసుకెళ్లి ఉగ్రవాదులుగా మార్చాలని కొందరు ప్రయత్నిస్తారు. షాలినీని అఫ్గానిస్థాన్‍కు చెందిన ఓ వ్యక్తి… అలానే పెళ్లి చేసుకొని తీసుకెళతాడు. చివరకు షాలినీ పరిస్థితి ఏమైంది ? తప్పించుకోగలిగిందా ? అనే ఇతి కాథాంశంతో సినిమాను ఆశక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు సుదీప్తో సేన్.

Also Read : Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ ‘ఓజి’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

The Kerala StoryZee5
Comments (0)
Add Comment