The Family Man 3: ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ షూటింగ్ ప్రారంభం !

‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ షూటింగ్ ప్రారంభం !

The Family Man 3: విశేష ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌సిరీస్‌ ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ ఒకటి. దీని మొదటి రెండు సీజన్లకు భారీ ప్రేక్షకాదరణ లభించడంతో మూడో దానికోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ టీమ్‌ శుభవార్త చెప్పింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3(The Family Man 3)’ షూటింగ్ ను ప్రారంభించినట్లు తెలిపింది. సీజన్‌ 3కు కూడా రాజ్‌ అండ్‌ డీకేనే దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఇప్పటికే చిత్రీకరణలో పాల్గొన్నారు. శ్రీకాంత్‌ తివారి పాత్రలో ఆయన మరింత ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. సీజన్‌ 3లో కుటుంబంలో ఎదురైన సమస్యలను ఆయన ఎలా అధిగమించనున్నాడు. అలాగే జాతీయభద్రతకు ఎదురవుతోన్న ముప్పును తన తెలివితో ఎలా తిప్పికొట్టాడో చూపనున్నారు.

The Family Man 3 Movie Updates

‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ గురించి మనోజ్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ… ‘ఈశాన్య భారతదేశంలో అధిక భాగం షూటింగ్ చేయనున్నాం. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ ఎక్కడైతే పూర్తైందో అక్కడినుంచే ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ మొదలవుతుంది. శ్రీకాంత్‌ తివారీ (మనోజ్‌ బాజ్‌పాయ్‌ పోషించిన పాత్ర) పిల్లలు పెద్దవాళ్లు అవుతారు. ఆయనకు వయసు పెరిగినా సవాళ్లు వెంటాడుతూనే ఉంటాయి. ఈసారి వాటిని ఎలా ఎదుర్కొన్నాడనేది సిరీస్‌లో తెలుస్తుంది’ అని తెలిపారు. 2019లో ‘ఫ్యామిలీ మ్యాన్‌’ మొదటి సీజన్‌ విడుదలై ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో అత్యధికమంది వీక్షణలు సొంతం చేసుకున్న సిరీస్‌గా నిలిచింది. ప్రముఖ హీరోయిన్‌ సమంత కీలక పాత్ర పోషించిన సీజన్‌ 2… 2021లో రిలీజై విశేషంగా ఆకట్టుకుంది. మూడో సీజన్‌ 2025లో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసం కదిలిన టాలీవుడ్ యంగ్ హీరోలు

amazon primethe family man
Comments (0)
Add Comment