Thangalaan: జీరో కట్స్‌తో సెన్సార్‌ పూర్తి చేసుకున్న విక్రమ్ ‘తంగలాన్‌’ !

జీరో కట్స్‌తో సెన్సార్‌ పూర్తి చేసుకున్న విక్రమ్ ‘తంగలాన్‌’ !

Thangalaan: నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘తంగలాన్‌(Thangalaan)’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్‌, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా రంజిత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. డీ గ్లామర్ పాత్రలో విక్రమ్ లుక్, గెటప్స్ చూస్తే గతంలో సేతు, శివపుత్రుడు, అపరిచితుడు వంటి క్రేజీ హిట్స్ ను తలపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. దీనితో ఈ సినిమా కోసం కోలీవుడ్ తో పాటు పాన్ ఇండియాలో అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Thangalaan Movie Updates

అయితే ఈ సినిమాను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లు షురూ చేసిన చిత్ర యూనిట్… సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుని సినిమా విడుదలకు పూర్తి స్థాయిలో సిద్ధమైయింది. ఎలాంటి కట్స్‌ లేకుండా సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. 2 గంటల 36 నిమిషాల 59 సెకండ్స్‌గా ఈ చిత్రం రన్ టైమ్‌ ఉంది.ఈ సినిమా అందరి అంచనాలను అందుకుని భారీ విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో ట్రైలర్‌ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రంలో విక్రమ్‌ ఎలా ఉంటారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో కథానాయికగా కనిపించనున్న మాళవిక మోహనన్‌… ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “తంగలాన్(Thangalaan) సినిమా కోసం నేను రోజు 5 గంటల పాటు మేకప్‌ వేసుకోవాల్సి వచ్చింది. స్కిన్‌ స్పెషలిస్ట్‌ దగ్గర నుంచి కంటి డాక్టర్‌ వరకు ఐదుగురు వైద్యులను కలిశాను. ఒక్కోరోజు దాదాపు 10 గంటలపాటు కెమికల్స్‌ తో చేసిన మేకప్‌ శరీరంపై ఉండేసరికి ఎలర్జీ వచ్చింది” అన్నారు.

విక్రమ్‌ మాట్లాడుతూ ‘ఇప్పటిదాకా ఏ సినిమాకు ఇంత కష్టం పడలేదు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మరో ప్రపంచం లోకి వెళ్తారు’’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Megastar Chiranjeevi: ‘గద్దర్‌ అవార్డ్స్‌’పై ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ కు చిరంజీవి కీలక సూచన !

Chiyaan VikramPa RanjithThangalaan
Comments (0)
Add Comment