Thangalaan 2: త్వరలో విక్రమ్‌ ‘తంగలాన్‌ 2’ ?

త్వరలో విక్రమ్‌ ‘తంగలాన్‌ 2’ ?

Thangalaan 2: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్, ప్రీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. బాహుబలి, కేజీఎఫ్, సలార్, కాంతారా వంటి సినిమాలు ఇప్పటికే వీటిపై ఓ క్లారిటీకి రాగా ఇటీవల విక్రమ్, పా రంజిత్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘తంగలాన్‌’ కూడా వీటి కోవలో చేరిపోనుంది. ఆగస్టు 15 సందర్భంగా విడుదలైన ‘తంగలాన్‌’బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు హీరో విక్రమ్, దర్శకుడు పా రంజిత్ కూడా విమర్శల ప్రశంసలు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ‘తంగలాన్‌’ సినిమా విజయోత్సవ సంబరాల్లో మునిగితేలుతున్నారు.

Thangalaan 2 Movie Updates

ఈ విజయోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ‘తంగలాన్‌’కు సీక్వెల్ గా ‘తంగలాన్‌ 2(Thangalaan 2)’కు తీసుకురాబోతున్నట్లు హీరో విక్రమ్ ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో విక్రమ్‌ మాట్లాడుతూ… ‘‘ఇదొక మట్టి సినిమా. దీనికి తెలుగు నుంచి మంచి స్పందన వస్తుందని బలంగా నమ్మా. త్వరలో ‘తంగలాన్‌ 2’ని తీసుకొస్తాం’’ అన్నారు. ‘‘ఈ కథను విక్రమ్‌ తనదైన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లారు’’ అన్నారు దర్శకుడు పా.రంజిత్‌.

నిర్మాత జ్ఞానవేల్‌ రాజా మాట్లాడుతూ… ‘‘మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఇప్పుడు మా ‘తంగలాన్‌’పై అదే ప్రేమ చూపిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. కార్యక్రమంలో మాళవిక, ధనుంజయన్, జీవీ ప్రకాశ్‌ కుమార్, మధుర శ్రీధర్, భాస్కరభట్ల, రాకేందు మౌళి, బాలా తదితరులు పాల్గొన్నారు.

నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘తంగలాన్‌’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్‌, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా రంజిత్‌ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది.

Also Read : Thalapathy 69: విజయ్‌ ‘దళపతి 69’ సినిమా ఖరారు ! దర్శకుడు ఎవరంటే ?

Chiyaan VikramKE JnanavelrajaPa RanjithThangalaan
Comments (0)
Add Comment