Thangalaan: తూచ్ అంటున్న “తంగలాన్” సినిమా యూనిట్

"తంగలాన్" సినిమా "శివపుత్రుడు" సీక్వెల్ కాదు

తూచ్ అంటున్న “తంగలాన్” సినిమా యూనిట్

Thangalaan :నటుడు, జాతీయ అవార్డుల గ్రహీత చియాన్ విక్రమ్-పా రంజిత్ కాంబోలో తెరకెక్కుతున్న “తంగలాన్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. బంగారు గనుల నేపథ్యంలో ఓ తెగ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ అందరిలోనూ ఆశక్తిని రేకెత్తించింది.

ఇటీవల నిర్వహించిన టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో విక్రమ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ముఖ్యంగా “నాకు ఈ సినిమాలో డైలాగ్లు లేవు… శివపుత్రుడు తరహాలో ఉంటుంది. అందరికీ నచ్చుతుంది” అంటూ విక్రమ్ చేసిన వ్యాఖ్యలతో “తంగలాన్” కాస్తా “శివపుత్రుడు” సీక్వెల్ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేసారు. బాక్సాఫీసు ముందు కాసుల వర్షం కురిపించడమే కాకుండా తనకు జాతీయ అవార్డు తెచ్చి పెట్టిన శివపుత్రుడు సినిమాతో తంగలాన్(Thangalaan) సినిమాతో ఏ ఉద్దేశ్యంతో కంపేరిజన్ చేసాడో కాని చిత్ర యూనిట్ మాత్రం విక్రమ్ ఈ సినిమాకు సంబందించి టాప్ సీక్రెట్ ను బయటపెట్టాడంటూ నష్ట నివారణా చర్యలు ప్రారంభించింది.

Thangalaan – తంగలాన్ లో విక్రమ్ కు డైలాగ్లున్నాయి

విక్రమ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు స్పందించిన చిత్ర యూనిట్… విక్రమ్ కు టీజర్ లో మాత్రమే డైలాగుల్లేవని స్పష్టం చేసింది. ఆయన మాట్లాడింది సినిమా మొత్తం గురించి కాదు. ఇందులో ఆయనకు డైలాగులున్నాయి. అన్ని సన్నివేశాలను లైవ్ సౌండ్ తో తెరకెక్కించా అంటూ చిత్ర యూనిట్ వివరించింది.

2024 జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తంగలాన్

బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న తంగలాన్ సినిమాలో విక్రమ్ సరసన మాళవిక మోహన్ కథానాయికగా నటిస్తోంది. నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాలో పార్వతీ, పశుపతి, డానియన్, కాల్టాగిరోన్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారతీయ, విదేశీ భాషల్లో 2డీ, 3డీ ల్లో 2024 జనవరి 26న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Also Read : Thangalaan: తూచ్ అంటున్న “తంగలాన్” సినిమా యూనిట్

 

paranjitThangalaanvikram
Comments (0)
Add Comment