Thandel : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన చందు మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ దూసుకు పోతోంది. ఈనెల 7న తండేల్(Thandel) మూవీ విడుదలైంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆశించిన దానికంటే ఎక్కువ ఆదరణ పొందింది. పెద్ద ఎత్తున కలెక్షన్లు రావడంతో నిర్మాత, దర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Thandel Exclusive Collections
నిజ జీవితంలో జరిగిన కథ ఆధారంగా తండేల్ ను తెరకెక్కించాడు దర్శకుడు. దీనిని దృశ్య కావ్యంగా మార్చేశాడు. ప్రధానంగా విశాఖ సముద్రాన్ని అందంగా తీశాడు. ఈ సినిమాకు మనసు పెట్టి చేశాడు రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. తను అందించిన పాటలు ఇప్పటికే ట్రెండింగ్ లో కొనసాగుతుండడం విశేషం.
హైలెస్సో హైలెస్సా అనే సాంగ్ టాప్ లో ఉంది. ఈ సినిమాలో నాగ చైతన్య కంటే ఎక్కువగా మనసు పెట్టి చేసింది నేచురల్ నటి సాయి పల్లవి. ఇద్దరూ కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదాలో నటించారు. వీరి కాంబినేషన్ మరోసారి రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఎక్కడా అసభ్యత అన్నది లేకుండా ఇంటిల్లిపాది కలిసి చూసేలా తీర్చిదిద్దాడు సినిమాను చందు మొండేటి. మూవీని భారీ ఖర్చుతో తెరకెక్కించారని టాక్. దాదాపు రూ. 50 కోట్లు పెట్టినట్లు జోరుగా ప్రచారం జరిగింది.
సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున మూవీ మేకర్స్ చేసిన ప్రచారం తండేల్ సక్సెస్ కు కారణమైందని చెప్పక తప్పదు.
Also Read : Naga Chaitanya Shocking :మేం విడి పోవడం బాధాకరం