Thandel Sensational Coll :వ‌సూళ్ల వేట‌లో తండేల్ రికార్డ్

రూ. 21.27 కోట్లు దాటేసిన మూవీ

Thandel : గీతా ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు ప్ర‌తిష్టాత్మ‌కంగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన తండేల్ చిత్రం దుమ్ము రేపుతోంది. వ‌సూళ్ల ప‌రంగా దూసుకు పోతోంది. రిలీజైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ చిత్రం. తాజాగా తండేల్(Thandel) మూవీ క‌లెక్ష‌న్ల‌కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మూవీ మేక‌ర్స్. ఎక్స్ వేదిక‌గా అధికారికంగా త‌మ చిత్రానికి సంబంధించి క‌లెక్ష‌న్లు రూ. 21.27 కోట్లు దాటాయ‌ని ప్ర‌క‌టించారు.

Thandel Sensational Collections

గ‌త నెల‌లో మూడు భారీ బ‌డ్జెట్ తో తీసిన సినిమాలు విడుద‌ల‌య్యాయి. రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్, బాల‌కృష్ణ డాకు మ‌హారాజ్, వెంక‌టేశ్ న‌టించిన సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వీటి చెర్రీ మూవీ బొక్కా బోల్తా ప‌డింది. ఇక బాల‌య్య‌, విక్ట‌రీ వెంకీ మూవీస్ రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్లు సాధించాయి.

తాజాగా బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల స‌ర‌స‌న చేరింది తండేల్ మూవీ. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో అక్కినేని నాగ చైత‌న్య‌, నేచుర‌ల్ యాక్ట‌ర్ సాయి ప‌ల్ల‌వి న‌టించారు. చిత్రానికి ప్రాణం పోశారు. నువ్వా నేనా అన్న రీతిలో జీవించారు త‌మ‌కు ఇచ్చిన పాత్ర‌ల్లో.

ఈ సినిమా బిగ్ స‌క్సెస్ కావ‌డానికి సంగీతం కూడా దోహ‌దం చేసింది. రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ ప్రాణం పోశాడు. హైలెస్సో హైలెస్సా సాంగ్ హైలెట్ గా నిలిచింది. చార్ట్స్ ల‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. తండేల్ పోటీకి సినిమాలు లేక పోవ‌డంతో ప్రేక్ష‌కులు ఆద‌రించ‌డం ఖాయ‌మ‌ని, భారీ వ‌సూళ్లు వ‌స్తాయ‌ని మూవీ మేక‌ర్స్ భావిస్తున్నారు.

Also Read : Sid Sriram Magical Voice :అల‌ల స‌వ్వ‌డి ‘నీవ‌ల్లె నీవ‌ల్లె’ అల‌జ‌డి

CollectionsThandelTrendingUpdatesViral
Comments (0)
Add Comment