Hero Naga Chaitanya-Thandel :రూ. 100 కోట్ల క్ల‌బ్ లోకి తండేల్

బ్రేక్ ఈవెన్ ను దాటేసిన చిత్రం

Thandel : అక్కినేని నాగ‌చైత‌న్య‌, నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించిన తండేల్(Thandel) చిత్రం భారీ క‌లెక్ష‌న్స్ తో దూసుకు పోతోంది. నిజ జీవితంలో జ‌రిగిన ఘ‌ట‌న ఆధారంగా దీనిని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు చందు మొండేటి. త‌ను గ‌తంలో కార్తికేయ మూవీ తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేసేలా సినిమాను తీయ‌డంలో త‌న‌కు త‌నే సాటి అని నిరూపించు కున్నాడు మ‌రోసారి ద‌ర్శ‌కుడు.

Thandel Blockbuster Collections

ఇక సాయి ప‌ల్ల‌వి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తండేల్ మూవీలో ఆశించిన దానికంటే అద్భుతంగా పెర్ ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించింది. ఇక నాగ చైత‌న్య తో కాంబినేష‌న్ పండింది మ‌రోసారి తెర‌పై. వీరిద్ద‌రూ క‌లిసి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఫిదాలో న‌టించారు.

తండేల్ చిత్రంలో నాగా చైత‌న్య సాయి ప‌ల్ల‌వితో ఢీ అంటే ఢీ అనేలా పాత్రకు న్యాయం చేశాడు. తాజాగా మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తండేల్ చిత్రం రూ. 100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింద‌ని వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా ఫిబ్ర‌వ‌రి 7న మూవీ విడుద‌లైంది. గీతా ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు తండేల్ ను రూ. 50 కోట్లు ఖ‌ర్చు చేసి నిర్మించాడు.

ఈ సంద‌ర్బంగా న‌టీ న‌టులు త‌మ చిత్రాన్ని స‌క్సెస్ చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : Hero Sudheer Babu-Jatadhara : పాన్ ఇండియా మూవీగా జ‌టాధ‌ర

CinemaCollectionsThandelTrending
Comments (0)
Add Comment