Thandel Movie : సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న ‘తండేల్’ సినిమా

సాయి పల్లవి రెండోసారి చైతూతో చేస్తుండ‌గా దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు..

Thandel : ‘కస్టడీ’ సినిమా త‌ర్వాత అక్కినేని నాగ చైతన్య న‌టిస్తోన్న కొత్త చిత్రం తండేల్(Thandel). మెచ్చ‌ట‌గా మూడోసారి ద‌ర్శ‌కుడ చందూ మొండేటితో జ‌త క‌ట్టిన ఆయ‌న ప్ర‌స్తుతం ఆ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సాయి పల్లవి రెండోసారి చైతూతో చేస్తుండ‌గా దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‌రిలీజ్ చేయడానికి గీత ఆర్ట్స్ ప్లాన్ చేసింది. అయితే ఈ సినిమా విడుద‌ల విష‌యంలో అనేక వార్త‌లు వినిపిస్తున్న స‌మ‌యంలో ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ఓ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో తంగేల్ రిలీజ్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Thandel MOvie Updates

జనవరికి తండేల్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంటుందని, మరో 10 రోజుల చిత్రీకరణ మాత్రమే‌ మిగిలి ఉందని అన్నారు. ఈ డిసెంబర్ 25కి సినిమా రిలీజ్‌కు రెడీ కాద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఒకవేళ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజ‌ర్ విడుద‌ల ఉంద‌ని ఉందని అల్లు అరవింద్, వెంకీ మామ సినిమా వ‌స్తుంద‌ని చైత‌న్య ఆలోచిస్తే సంక్రాంతికి కూడా తండేల్(Thandel) మూవీ రిలీజ్ ఉండ‌ద‌ని అన్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

అక్కినేని ఫ్యామిలీకి ఎంతో కలిసొచ్చే సంక్రాంతికి తండేల్‌ సినిమా విడుద‌లపై అనుమానాలు రావ‌డంతో సినిమా రిలీజ్ డేట్‌పై అప్డేట్ ఇవ్వాలంటూ నాగ‌చైత‌న్య ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ సినిమాల‌పైన ఉన్న శ్ర‌ధ్ధ‌ మీ సినిమా రిలీజ్‌పై లేదు అటూ చుర‌క‌లు పెడుతునే సినిమా థియేటర్ రిలీజ్ ఏమొద్దు డైరెక్టు ఓటీటీ రిలీజ్ చేయ‌డంటూ ఓ రేంజ్‌లో కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉండ‌గా.. ఇప్పటికే సంక్రాంతి పోటీలో నుంచి చిరంజీవి ‘విశ్వంభరస త‌ప్పుకోవ‌డంతో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్ విడుద‌ల‌కు రెడీ అవుతుండ‌గా, బాలయ్య, బాబీ సినిమా, మరోవైపు వెంకీ, అనిల్ రావిపూడి సినిమాలు బరిలో ఉన్నాయి.

Also Read : Saree Movie : రిలీజ్ కు సిద్ధమవుతున్న రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ సినిమా

CinemaNaga ChaitanyaThandelUpdatesViral
Comments (0)
Add Comment