Thandel : సాయి పల్లవి, నాగ చైతన్య కలిసి నటించిన తండేల్(Thandel) దూసుకు పోతోంది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా పరంగా మొదట్లో మిక్స్ డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత సినిమా దుమ్ము రేపుతోంది. విడుదలైన ప్రతి చోటా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రత్యేకించి దర్శకుడు చందూ మొండేటి తండేల్ చిత్రాన్ని ఓ దృశ్య కావ్యంగా తీశాడు. ముందు నుంచే ఇది నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని చెబుతూ వచ్చాడు. వాస్తవానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
Thandel Trending Collections
అద్భుతమైన కథకు అందమైన సన్నివేశాలను, దృశ్యాలను తెరకు ఎక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు ఇచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేసే ఈ నటి కీలకమైన పాత్ర పోషించింది. నటనా పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది. తను ప్రదర్శించిన హావ భావాలు, చేసిన డ్యాన్సులు గుండెలను మీటేలా ఉన్నాయి.
చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సమర్పిస్తే..బన్నీ వాసు నిర్మించాడు. రూ.50 కోట్ల భారీ ఖర్చుతో తీసిన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే దాటేసింది. మొత్తం గ్రాస్ రూ. 73 కోట్లు దాటిందని మూవీ మేకర్స్ ప్రకటించారు. వారం రోజుల్లో రూ. 100 కోట్లు దాటడం పక్కా అని దర్శక, నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ఇక సినిమాకు హైలెట్ గా నిలిచింది మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ మ్యాజిక్ చేశాడు. పాటలతో హుషారు తెప్పించాడు. ప్రేక్షకులను థియేటర్లలో కూర్చునేలా చేశాడు.
Also Read : Anil Ravipudi Shocking Updates :మెగాస్టార్ తో నవ్వుల నజరానా గ్యారెంటీ