Thandel: చైతన్య కెరీర్ లో అతిపెద్ద డీల్ ‘తండేల్’ సినిమాకే !

చైతన్య కెరీర్ లో అతిపెద్ద డీల్ 'తండేల్' సినిమాకే !

Thandel: ‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ చిత్రాల తర్వాత నాగచైతన్య- చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందునున్న తాజా సినిమా ‘తండేల్‌’. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయిపల్లవి నటిస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన మత్సకారులు చేపల వేటకు వెళ్లి… పాకిస్తాన్ జైల్ లో బందీలుగా మారిన యథార్ధ కథ ఆధారంగా, విభిన్నమైన ప్రేమకథతో రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ‘తండేల్‌’ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టైటిల్ లుక్, టీజర్ కు అభిమానుల నుండి విశేషమైన స్పందన వచ్చింది. దీనితో ‘తండేల్‌’ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

Thandel Movie Updates

నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి ముచ్చటగా మూడోసారి కలిసి చేస్తున్న సినిమా ‘తండేల్(Thandel)’ డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ చేజిక్కుంచుకుంది. అంతేకాదు నాగ చైతన్య కెరీర్ లో అత్యధికంగా డిజిటల్ హక్కులు అమ్ముడుపోయే సినిమాగా ‘తండేల్‌’ నిలిచింది. ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ.40 కోట్లకి తీసుకుందని సమాచారం. ఇది నాగ చైతన్య కెరీర్ లో అత్యధికంగా అమ్ముడుపోయే సినిమాగా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ అన్ని దక్షిణ భారత మరియు హిందీ భాషల కోసం ‘తండేల్’ డిజిటల్ హక్కులను రూ. 40 కోట్లకు పొందింది. నాగ చైతన్య ఇటీవల నటించిన ఒక వెబ్ సిరీస్ కు మంచి స్పందన రావడం, అలాగే దర్శకుడు చందూ మొండేటి ‘కార్తికేయ 2’ సినిమా హిందీ మాట్లాడే ప్రదేశాల్లో బాగా ఆడటం, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ నుండి ఈ సినిమా రావటం, ఇలాంటి అంశాలన్నీ కలిపి ‘తండేల్’ ను అంత డబ్బులు పెట్టి తీసుకోవటానికి నెట్ ఫ్లిక్స్ ముందుకు వచ్చింది అని తెలుస్తోంది.

Also Read : Prasanth Varma: బాలీవుడ్ స్టార్ హీరోతో ‘హను-మాన్‌’ దర్శకుడి సినిమా !

Akkineni Naga ChitanyanetflixThandel
Comments (0)
Add Comment