Thandel : గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన చిత్రం తండేల్. నిజ జీవితంలో చోటు చేసుకున్న ఘటన ఆధారంగా తరకెక్కించాడు దర్శకుడు చందూ మొండేటి. తను గతంలో కార్తికేయ సినిమా తీశాడు. ఇది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా విడుదలైన తండేల్ చిత్రం ఆశించిన దానికంటే అద్భుతమైన విజయం దిశగా దూసుకు పోతోంది. ఇప్పటికే రూ. 100 కోట్లను దాటేసింది. సినీ వర్గాల అంచనా ప్రకారం తండేల్(Thandel) చిత్రాన్ని రూ. 50 కోట్లు పెట్టి తీశారు. దేశీయంగా కొంత కలెక్షన్లు స్లో గా ఉన్నప్పటికీ అంతర్జాతీయ పరంగా మాత్రం మార్కెట్ బాగానే ఉందని సమాచారం.
Thandel Overseas Success
తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలైంది. అందరూ ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న విడుదల చేస్తారని భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నటించిన సాయి పల్లవి వంద మార్కులు కొట్టేసింది. ఇక తనతో పోటీ పడి నటించేందుకు నానా తంటాలు పడ్డాడు అక్కినేని నాగ చైతన్య.
ఇక రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు అస్సెట్ గా మారింది. సక్సెస్ సాధించడంలో కీలకమైన పాత్ర పోషించింది. ప్రధానంగా శ్రీమణి రాసిన హైలెస్సో హైలెస్సా సాంగ్ చార్ట్స్ లో నెంబర్ వన్ గా కొనసాగుతోంది. రాబోయే రోజులలో తండేల్ కలెక్షన్స్ రాబట్ట వచ్చని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.
Also Read : Rashmika Confirms Love :రౌడీతో ప్రేమలో పడ్డానన్న రష్మిక