Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చిన తమన్

సుజీత్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘ఓజీ’ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు...

Pawan Kalyan : పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి బిజీ అయిపోయారు కానీ.. లేదంటే ఆయన నుండి వరుస సినిమాలు వచ్చేవి. అయితే పాలిటిక్స్‌లోకి వచ్చినా మిగిలిపోయిన మూడు సినిమాలను వీలైనంత త్వరగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. మూడు సినిమాల్లో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ లెక్క తేలడం లేదు కానీ.. ‘ఓజీ(OG)’, ‘హరి హర వీరమల్లు’ మాత్రం విడుదలకు నువ్వా నేనా అనేలా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో సినిమా విడుదల ప్రచారం షురూ చేయడానికి రెండు సినిమాలూ రెడీ అవుతున్నాయి. ఎందుకంటే వీకెండ్స్‌లో ఈ సినిమా షూటింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ‘హరి హర వీరమల్లు’ సినిమా సెట్స్‌లో పవన్‌ ఉన్న సీన్స్‌ తీస్తుంటే.. ‘ఓజీ(OG)’ సెట్స్‌లో పవన్‌ లేని సీన్స్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో అంతా అనుకున్నట్లుగా సాగితే కొత్త సంవత్సరం తొలి రోజు ‘ఓజీ’ ప్రచారం షురూ చేస్తారట.

Pawan Kalyan ‘OG’ Movie Updates

సుజీత్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘ఓజీ’ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. సినిమా దాదాపు 80 శాతం చిత్రీకరణ అయిపోయింది అని చెబుతున్నారు. అందుకే ప్రమోషన్స్‌ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట. ఈ నేపథ్యంలోనే తొలి గీతాన్ని చూపించి, వినిపించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

సెప్టెంబరు 2న పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజునాడు సినిమా తొలి పాట వస్తుంది అని వార్తలొచ్చాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో వరదల పరిస్థతి ఉండటంతో వాయిదా వేశారు అని అన్నారు. ఇప్పుడు ఆ పాటనే పాటనే కొత్త ఏడాది తొలి రోజున విడుదల చేస్తారు అని తెలుస్తోంది. ఓజాస్‌ గంభీర అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న ఈ యాక్షన్‌ డ్రామా వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. ఇప్పటికే వచ్చిన సినిమా టీజర్‌కు భారీ ఆదరణ దక్కింది. అన్నట్లు ఈ సినిమా కోసం స్పెషల్‌ టీమ్‌ పని చేస్తోంది అని ఇప్పటికే తమన్‌ చెప్పారు. మరి ఆ స్పెషల్‌ మ్యూజిక్‌ ఎలా ఉంటుంది అనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంది.

Also Read : Tharun Bhascker : టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుంచి మరో అప్డేట్

Moviesogpawan kalyanTrendingUpdatesViral
Comments (0)
Add Comment