Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజ‌య్‌పై చెప్పుతో దాడి ?

ద‌ళ‌ప‌తి విజ‌య్‌పై చెప్పుతో దాడి ?

Thalapathy Vijay: కోలీవుడ్ అగ్ర నటులు, దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) అధినేత కెప్టెన్ విజయకాంత్‌ అంత్యక్రియల్లో అపశృతి చోటు చేసుకుంది. విజయకాంత్ మృతదేహానికి నివాళులు అర్పించి వెళ్తుండగా… తమిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌(Thalapathy Vijay)పై మ‌రో హీరో అభిమానులు చెప్పు విసిరారు. హీరో విజ‌య్ నివాళులర్పించిన అనంతరం విజ‌య్‌కాంత్ భార్య ప్రేమ‌ల‌త‌ను ప‌రామ‌ర్శించి కారులో ఇంటికి వెళుతుండ‌గా వేరే హీరో అభిమానులు విజ‌య్ పై చెప్పులు విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలోనే కాకుండా త‌మిళ‌నాట హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘ‌ట‌న‌ను పార్టీల నాయ‌కులు, సినీ అభిమానులు తీవ్రంగా మండి ప‌డుతున్నారు. ఇలాంటి చ‌ర్య‌లు జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రం అంటూ ఖండిస్తున్నారు.

Thalapathy Vijay Viral

గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న ప్రముఖ సినీ నటులు, దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) అధినేత కెప్టెన్ విజయకాంత్‌ చెన్నైలోని మియత్‌ ఇంటర్నేషనల్‌ హాస్పిటల్‌లో గురువారం తుది శ్వాస విడిచారు. దీనితో అభిమానులు భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చే అవ‌కాశాలు ఉండ‌డంతో త‌మిళ‌నాడు రాష్ట్ర‌మంత‌టా హై అల‌ర్ట్ ప్ర‌క‌టించడంతో పాటు రెండు రోజులు సంతాప‌ దినాలు పాటించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేవ‌లం నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా, మాన‌వ‌తావాదిగా, సిసలైన‌ త‌మిళవాదిగా ప్రజల్లో చిర‌స్థాయి ముద్ర వేసుకున్న విజయ్‌ కాంత్ మృతితో అభిమానులతో పాటు, యావత్‌ తమిళ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.

శుక్ర‌వారం విజ‌య్‌కాంత్ పార్థివదేహానికి ఆంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల్సి ఉండ‌డంతో ఆయ‌న మృత‌దేహాన్ని గురువారం రాత్రి డీఎండీకే ప్రధాన కార్యాలయానికి త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో త‌మిళ సినీ ఇండ‌స్ట్రీ ఆగ్ర న‌టుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు, అభిమానులు శుక్ర‌వారం తెల్ల‌వారుజాము నుంచే విజ‌య్ కాంత్‌ను చివ‌రి చూపులు చూడ‌డానికి ల‌క్ష‌ల సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఈక్ర‌మంలో ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హ‌స‌న్‌, ద‌ళ‌ప‌తి విజ‌య్‌, విజ‌య్ అంటోని, మ‌న్సూర్ అలీఖాన్ వంటి న‌టులు స్వ‌యంగా వెళ్లి విజ‌య్ కాంత్ మృత‌దేహానికి నివాళులు అర్పించారు.

Also Read : Ram Gopal Varma: వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ !

Captain VijayakanthThalapathy Vijay
Comments (0)
Add Comment