Thalapathy Vijay : ఏళ్ల‌వుతున్నా వ‌న్నె త‌గ్గ‌ని అందం

త్రిష కృష్ణ‌న్ అద్భుత‌మైన న‌టి

Thalapathy Vijay : లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ , త్రిష కృష్ణ‌న్ క‌లిసి న‌టించిన లియో చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. వీరితో పాటు సంజ‌య్ ద‌త్ , అర్జున్ కూడా న‌టించారు. మూవీ స‌క్సెస్ సంద‌ర్బంగా చెన్నైలో జ‌రిగిన ఈవెంట్ లో పాల్గొన్న జోసెఫ్ విజ‌య్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Thalapathy Vijay Comment

నేను ఎంతో మంది హీరోయిన్ల‌తో సినిమాలు చేశా. కానీ వారిలో త్రిష కృష్ణ‌న్ డిఫ‌రెంట్. 20 ఏళ్ల‌లో ఎవ‌రైనా సినిమా రంగంలోకి వ‌స్తారు. కానీ 20 ఏళ్ల పాటు త‌న కెరీర్ లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నెట్టుకు రావ‌డం మామూలు విష‌యం కాద‌న్నాడు ద‌ళ‌ప‌తి.

అందంలోనే కాదు న‌ట‌నా ప‌రంగా కూడా టాప్ లో ఉంద‌న్నాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. షూటింగ్ లో జోవియ‌ల్ గా ఉంటుంది. త‌న‌తో సినిమా చేస్తున్నాన‌న్న భావ‌న ఉండ‌ద‌న్నాడు విజ‌య్(Thalapathy Vijay). అంత బాగా క‌లిసి పోతుంద‌ని పేర్కొన్నాడు.

మొత్తంగా మా ఇద్ద‌రి కాంబినేష‌న్ లో లియో రావ‌డం ఆనందంగా ఉంద‌న్నాడు ద‌ళ‌ప‌తి. ఇద్ద‌రం కూడా సినిమాలో నటిస్తున్నామా లేదా అన్న‌దే చూస్తామే తప్పా డ‌బ్బుల గురించి ఆలోచించమ‌ని పేర్కొన్నాడు.

Also Read : Samantha: నా సూపర్ హీరో అతనే

Comments (0)
Add Comment