Thalapathy Vijay : కోలీవుడ్’ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ్‌లో సూపర్ స్టార్ గా వెలుగొందుతోన్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. ఇటీవలే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. కాగా విజయ్(Thalapathy Vijay) కు సామాజిక దృక్పథం ఎక్కువ. సినిమా షూటింగులతో ఉంటున్నా తనవంతు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. కొన్ని రోజుల క్రితం తమిళనాడు వరద బాధితులకు భారీ నెలల విరాళాలు ఇచ్చి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు.
అలాగే 12వ తరగతి పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులకు ప్రోత్సాహకరంగా బహుమతులు అందజేశాడు. కాగా, 12వ తరగతి పరీక్షలో 600/600 మార్కులు సాధించిన నందినికి కానుకగా డైమండ్ నెక్లెస్ ను కానుకగా ఇచ్చాడు. అదే సమయంలో రెండు వేల మంది ఉత్తమ విద్యార్థులకు ఆర్థిక సాయం చేశాడు. ఇప్పుడు కూడా మరోసారి విద్యార్థులకు సాయ మందించేందుకు రెడీ అయ్యారీ స్టార్ హీరో. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ 10, 12వ తరగతి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశాడు విజయ్.
Thalapathy Vijay Helps..
విజయ్ దళపతి జూన్ 22న తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో లాగే ఈ సారి కూడా ప్రోత్సాహక బహుమతులు అందజేయాలని నిర్ణయించుకున్నాడు విజయ్(Thalapathy Vijay). . తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో 10, 12వ తరగతి ఫలితాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంచుకుని వారందరినీ పిలిపించి బహుమతులు అందించారు. ఇటీవలే పదో తరగతి, 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్ధులను తమిళనాడు వెట్రి కజగం తరపున విజయ్ ఓ ప్రకటనలో అభినందిస్తూ, త్వరలోనే కలుస్తామని ప్రకటించారు. జూన్ 22న విజయ్ 50వ పుట్టినరోజు కాబట్టి ఆరోజే విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. 234 నియోజకవర్గాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన పదో తరగతి, 12వ తరగతి విద్యార్థులను గుర్తించే పనిని విజయ్ అభిమానులకు అప్పచెప్పినట్లు సమాచారం.
Also Read : Mamitha Baiju : ఓ కాలేజీ ఈవెంట్లో తన డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించిన ప్రేమలు బ్యూటీ