Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay), మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘గోట్’(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. స్నేహ, లైలా, ప్రశాంత్, మోహన్, జయరాం, అజ్మల్, అమీర్, యోగిబాబు, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కల్పాత్తి ఎస్ అఘోరం, కల్పాత్తి ఎస్ గణేష్, కల్పాత్తి ఎస్. సురేష్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ కథాచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, సిద్ధార్థ నూని ఛాయాగ్రహణం అందించారు. దళపతి విజయ్ రాజకీయ పార్టీను స్థాపించి వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకు దిగుతామని చెప్పడంతో ఈ సినిమా విడుదలపై అంతా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను 6000 థియేటర్స్ కు పైగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Thalapathy Vijay Movie Updates
సెప్టెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పూర్తయింది. ఈ విషయాన్ని డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. గోట్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే రిలీజైన ది గోట్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో డిఏజింగ్ టెక్నాలజీను ఉపయోగించి విజయ్ ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు. ఈ మూవీలో విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ది గోట్.. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.
Also Read : Pawan Kalyan: అన్నయ్య చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్ !