Hero Vijay Movie : 26న ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ ఫ‌స్ట్ లుక్

పేరు ఖరారు చేసిన మూవీ మేక‌ర్స్

Vijay : ల‌క్ష‌లాది అభిమానుల ఆరాధ్య దైవంగా భావించే త‌మిళ సినీ అగ్ర న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్(Vijay) ఆఖ‌రి చిత్రం 69వ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా కొన‌సాగుతోంది. త‌న సినీ కెరీర్ లో ఇదే చివ‌రిదంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు . దీంతో దేనిపై ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన హెచ్ . వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Thalapathy Vijay Movie..

ఈనెల 26న గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా విజ‌య్ మూవీకి సంబంధించి ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు అనౌన్స్ చేశారు సినీ నిర్మాత‌లు. ప్ర‌స్తుతం సినీ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు చిత్రానికి సంబంధించి పేరు కూడా ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది.

దీనికి నాలైయ తీర్పు అని పేరు పెట్టిన‌ట్లు టాక్. తెలుగులో అయితే రేప‌టి తీర్పు అని అర్థం. ఇదే టైటిల్ ను ఫిక్స్ అయిన‌ట్లు స‌మాచారం. విచిత్రం ఏమిటంటే త‌న తండ్రి చంద్ర‌శేఖ‌ర్ కూడా ద‌ర్శ‌కుడే. విజ‌య్ తొలుత త‌న తండ్రి తీసిన చిత్రంలోనే న‌టించ‌డం విశేషం. ఆనాడు పెట్టింది పేరు కూడా ఇదే. దీనినే తిరిగి చివ‌రి సినిమాకు పెట్ట‌డం గ‌మ‌నార్హం.

ఓ వైపు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే మ‌రో వైపు ద‌ళ‌ప‌తి విజ‌య్ పార్టీ కార్య‌క‌లాపాల‌పై ఫోక‌స్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించారు.

Also Read : MP Vijayasai Reddy Shocking : విజ‌య సాయి రెడ్డి పాలిటిక్స్ కు గుడ్ బై

CinemaThalapathy VijayTrendingUpdates
Comments (0)
Add Comment