Thalapathy 69: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్… ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమాతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షులను పలకరించబోతున్నారు. మరోవైపు 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష‍్యంగా విజయ్ పాలిటిక్స్ లోకి వచ్చాడు. ఇప్పటికే ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దీనితో విజయ్ తన సినిమాలకు విరామం ప్రకటిస్తున్నట్లు గతంలో చెప్పారు. అయితే తన 69వ చిత్రం అనంతరం సినిమాలకు విరామం తీసుకోనున్నట్లు చెప్పారు. దీనితో విజయ్ 69(Vijay) సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు.
Thalapathy 69th Movie Updates
తాజాగా విజయ్ 69 సినిమాపై దర్శకుడు హెచ్.వినోద్ అప్‌డేట్ ఇచ్చారు. తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘దళపతి 69(Thalapathy 69)’ అనే వర్కింగ్ టైటిల్ తో ఇది రూపొందనుంది. కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. తాజాగా హెచ్ వినోద్ ఈ చిత్రం గురించి ఓ అవార్డు కార్యక్రమంలో మాట్లాడారు. విజయ్ చివరి సినిమాకు తాను దర్శకత్వం వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలిపారు. అందరూ అనుకుంటున్నట్లు ఇది పొలిటికల్ థ్రిల్లర్ కాదని.. కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని పేర్కొన్నారు.
ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఇందులో కీలక పాత్రలో నటించనున్నట్లు, సమంత, మమితా బైజు హీరోయిన్లుగా కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాకి మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ స్వరాలు అందించనున్నారు. విజయ్ ప్రస్తుతం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) తో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రధారులు. సెప్టెంబర్ 5న సినిమా విడుదల కానుంది.
Also Read : Parakramam: బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ట్రైలర్ విడుదల చేసిన సందీప్ కిషన్ !