Vettaiyan OTT : ఓటీటీలో అలరిస్తున్న తలైవా ‘వెట్టయాన్’ సినిమా

యాక్షన్చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్ కథకి మరింత బలాన్ని చేకూర్చాయి...

Vettaiyan : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయాన్‌’ ఓటీటీ ప్రకటన అధికారికంగా వచ్చేసింది. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పంద‌న‌ రాబ‌ట్టింది. జైల‌ర్ త‌ర్వాత ర‌జ‌నీ ఖాతాలో మ‌రో హిట్ వ‌చ్చి చేరింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా రజనీకాంత్ యాక్షన్ .. కథలోని ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

Vettaiyan Movie OTT Updates

యాక్షన్చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్ కథకి మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ చిత్రంలో ర‌జ‌నీతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రలు పోషించారు. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 420 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కాగా వేట్టయాన్‌ నవంబర్ 8న ఓటీటీలో విడుదల కానున్నట్లు అమెజాన్‌ ప్రైమ్ వీడియో అధికారికంగా సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్‌,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఒక పోస్టర్‌ను పంచుకుంది. అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్‌ హక్కులను రూ. 90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం.

Also Read : Varun Tej-Matka : ‘మట్కా’ సినిమా సక్సెస్ తనకు చాలా ఇంపార్టెంట్ అంటున్న మెగా హీరో

CinemaOTTTrendingUpdatesVettaiyanViral
Comments (0)
Add Comment