Thalaivar 171: ‘తలైవా171’ సినిమా టైటిల్ ‘కళుగు’ ?

‘తలైవా171’ సినిమా టైటిల్ 'కళుగు' ?

Thalaivar 171: సూపర్ స్టార్ రజనీకాంత్… కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్… తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘తలైవా171’ (వర్కింగ్ టైటిల్) గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ‘తలైవా 171’ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించనుండగా… ఇందులో శివకార్తికేయన్‌ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్(Rajinikanth) సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్… టైటిల్ రిలీజ్ టీజర్ ను ఏప్రిల్ 22న విడుదల చేయడంతో పాటు సినిమా షూటింగ్ ను జూన్ నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు.

Thalaivar 171 Movie Updates

అయితే చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ను బట్టి రజనీ-లోకేశ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. రజనీకాంత్‌(Rajinikanth) గెటప్‌ చూస్తేనే ఇదేదో డాన్‌ కథా చిత్రంగా ఉంటుందనిపించేలా ఉంది. వైరెటీగా రజనీకాంత్‌ చేతులకు వాచీలతో కూడిన భేడీలు వేసిన ఫొటో ఉన్న పోస్టర్‌ కు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. దీనితో ఇది టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అయితే అలాంటి కథ కాదని దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ స్పష్టం చేశారు. అంతే కాకుండా ఇది మాదకద్రవ్యాలు, కిడ్నాప్‌కు సంబంధించిన కథ కూడా కాదని చెప్పారు.

దీనితో ఈ చిత్ర కథపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ‘కళుగు’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా ‘కళుగు’ అంటే ఇంగ్లీష్ లో ‘ఈగిల్‌’ అని అర్థం. కాగా ఇదే టైటిల్‌ తో తెరకెక్కించిన సినిమాలో రజనీకాంత్‌ 1981లో కథానాయకుడిగా నటించారు. అయితే ఈ టైటిల్ కన్షర్మేషన్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read : Kajal Aggarwal: ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ‘కాజల్ కార్తీక’ !

Lokesh KanagarajSuper Star Rajanikanththalaivar 171
Comments (0)
Add Comment