TG Women Commission Warning :బూతు సినిమాలు..వల్గ‌ర్ డ్యాన్సులపై గుస్సా

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మ‌హిళా క‌మిష‌న్

TG Women Commission : ఏం తమాషాగా ఉందా..వ‌ళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని సినిమాలు తీయాలి. సినిమా రంగానికి సామాజిక బాధ్య‌త ఉంద‌ని మ‌రిచి పోతే ఎలా..? ఇలాగే త‌మ ఇష్టానుసారం మూవీస్ తీసుకుంటూ పోతామ‌ని అంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ(Telangana) రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్(Women Commission) ప‌ర్స‌న్ నేరెళ్ల శార‌ద‌. ఇప్ప‌టికే ఆమె అంటేనే ద‌డ పుడుతోంది. ఏపీకి చెందిన కీల‌క మంత్రిగా ఉన్న నారాయ‌ణ‌కు చెందిన స్కూల్స్, కాలేజీల‌పై ఉక్కుపాదం మోపారు. నోటీసులు కూడా జారీ చేశారు. గీత దాటినా, పిల్ల‌ల‌కు ఏమైనా జ‌రిగినా చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చ‌రించారు.

TG Women Commission Warning

ఇదే స‌మ‌యంలో తాజాగా తెలుగు సినిమాలు లైన్ త‌ప్ప‌డంపై సీరియ‌స్ గా స్పందించారు. అస‌లు ఏం చేస్తున్నారో తెలిసే చేస్తున్నారా అని మండిప‌డ్డారు. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, న‌టీ న‌టులకు పూర్తి బాధ్య‌త ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. తాము సొసైటీలో బ‌తుకుతున్నామ‌న్న సోయి లేకుండా సినిమాలు తీస్తే ఎలా అని నిల‌దీశారు. ఇటీవ‌ల స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా , పాట‌లు, డైలాగులు, దృశ్యాలు ఉంటున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు చైర్ ప‌ర్స‌న్ నేరెళ్ల శార‌ద‌. కుటుంబం చూసే సినిమాలు రావ‌డం లేద‌ని, ఇదే స‌మ‌యంలో పిల్ల‌ల‌ను, ముఖ్యంగా ఆడపిల్ల‌లు, యువ‌త సిగ్గుతో త‌ల దించుకునేలా పాట‌లు ఉంటున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇటీవ‌ల జ‌న‌సేన పార్టీ నుంచి స‌స్పెండై , జైలు నుంచి బెయిల్ పై రిలీజ్ అయిన శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేసిన పాట‌లు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. దేశ వ్యాప్తంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మైంది. దీనికి బ‌దులు బ్లూ ఫిలింస్ తీస్తే స‌రి పోతుంద‌న్న కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున వ‌చ్చాయి. విచిత్రం ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన డాకు మ‌హారాజ్ లో న‌టి ఊర్వ‌శి రూటేలా పిరుదుల‌పై కొట్ట‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తమైంది. తాజాగా నితిన్ రెడ్డి, శ్రీ‌లీల న‌టించిన రాబిన్ హుడ్ చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ లో కేతకి శ‌ర్మ న‌టించింది. త‌న ముందు భాగాన్ని , వెనుక భాగాన్ని త‌డుముతూ..ఊపుతూ ఉన్న దృశ్యం క‌ల‌క‌లం రేపింది. దీనిపై సీరియ‌స్ అయ్యారు చైర్ ప‌ర్స‌న్ నేరెళ్ల శార‌ద‌. చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

Also Read : Hero Rana Daggubati : ప‌ర్మిష‌న్ ఉన్న బెట్టింగ్ యాప్స్ కే ప్ర‌మోష‌న్

 

UpdatesViralWarningWomen Commission
Comments (0)
Add Comment