Vishnu Priya : హైదరాబాద్ – నటి విష్ణుప్రియకు హైకోర్టులో చుక్కెదురైంది. బెట్టింగ్ యాప్స్ ఎఫ్ఐఆర్ కొట్టేయాలని దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది. ఎఫ్‌ఐఆర్ కొట్టి వేయడానికి, దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని విష్ణుప్రియను ఆదేశించింది. చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేసింది. బెట్టింగ్ యాప్స్‌పై ప్రచారం చేసినందుకు మియాపూర్ పీఎస్‌లో విష్ణు ప్రియ(Vishnu Priya) సహా పలువురు ఇన్ ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. ఇదే సమయంలో బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టింది. మొత్తం 25 మందికి పైగా కేసు నమోదు చేశారు.
Vishnu Priya got Shock from High Court
విష్ణుప్రియతో పాటు బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరిని కూడా విచారించింది. ఎంక్వయిరీ సందర్బంగా ఇద్దరికి సంబంధించిన మొబైల్స్ ను స్వాధీనం చేసుకుంది. 11 మంది యూట్యూబర్స్ తో పాటు సినీ నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్ , మంచు లక్ష్మి, యాంకర్ శ్యామల, తదితరులపై కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు ప్రముఖ క్రికెటర్లు సచిన్ రమేష్ టెండూల్కర్, విరాట్ కోహ్లీతో పాటు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ పై కూడా కేసు నమోదయ్యాయి.
వీరితో పాటు ప్రముఖ హీరోలు నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ , డార్లింగ్ ప్రభాస్ పై ఫిర్యాదు చేశారు. వారు ఫన్ 88 బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారని పేర్కొన్నారు . తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు కొత్త మలుపు తిరిగింది. యాంకర్ శ్యామల ఆంధ్ర365 బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆమెపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచిత్రం ఏమిటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఒక్కో వీడియోకు విష్ణు ప్రియ రూ. 90 వేలు వసూలు చేసినట్లు టాక్.
Also Read : Hero Salman Khan : నా లైఫ్ అల్లాహ్ చేతుల్లో ఉంది