Mohan Babu : ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

మోహన్ బాబుకి వారం క్రితమే తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది...

Mohan Babu : నటుడు మోహన్‌ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈనెల 24 వరకు మోహన్‌బాబుకు కోర్టు గడువు ఇచ్చిందని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 24 తర్వాత మోహన్‌బాబుకు నోటీసులు ఇస్తామని, చట్టపరమైన చర్యలు ఉంటాయని సీపీ వెల్లడించారు.

Mohan Babu Case Updates

మోహన్ బాబుకి వారం క్రితమే తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. హత్యాయత్నం కేసులో సోమవారం వరకు అరెస్ట్ చెయ్యొద్దని కోరుతూ బెయిల్ పిటిషన్ కోరారు మోహన్ బాబు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మోహన్ బాబు ఇక్కడే ఉన్నారనే విషయాన్ని అఫడవిట్ లో దాఖలు చేయాలని కోరింది. అప్పుడే ఏదైనా తేల్చుతాం అని తెలిపిన కోర్టు.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేయగా సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది.

Also Read : R Narayana Murthy : సంధ్య థియేటర్ బాధితుడు ‘శ్రీతేజ్’ ను పరామర్శించిన నటుడు

Comments (0)
Add Comment