TG Govt- Gaddar Awards Sensational :గ‌ద్ద‌ర్ అవార్డుల కోసం స‌ర్కార్ ప్ర‌క‌ట‌న

రెండు రోజుల్లో విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డి

TG Govt : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విధంగా ప్ర‌జా యుద్ద నౌక‌, దివంగ‌త గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పేరుతో అవార్డులు ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన కొంద‌రు న‌టీ న‌టులు అభ్యంత‌రం తెలిపారు. గ‌ద్ద‌ర్ న‌క్స‌లిజాన్ని స‌పోర్ట్ చేశారని, ఆయ‌న‌కు ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నించారు. గాయ‌కుడికి సినీ రంగానికి ఏంటి సంబంధం అంటూ ప్ర‌శ్నించారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం కూడా చోటు చేసుకుంది. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం .

TG Govt Will Announce Gaddar Awards

ఎవరికి అభ్యంత‌రం ఉన్నా లేక పోయినా గ‌ద్ద‌ర్ పేరుతో అవార్డులు ఇవ్వ‌డం ఖాయ‌మ‌న్నారు.
నంది అవార్డుల స్థానంలో గ‌ద్ద‌ర్ పేరుతో అవార్డులు ఇస్తామ‌ని తెలిపారు. ఈమేర‌కు రెండు రోజుల్లో గ‌ద్ద‌ర్ అవార్డుల నోటిఫికేష‌న్ రిలీజ్ చేస్తామ‌ని వెల్ల‌డించింది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం. వ‌చ్చే నెల ఏప్రిల్ నెల‌లో అవార్డుల‌ను సినీ క‌ళాకారుల‌కు ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. తెలుగు చలనచిత్ర పురస్కారాలకు సంబంధించిన విధి విధానాలను ముఖ్య‌మంత్రి ప‌రిశీలించి, ఆమోదం తెలిపారు.

విధి విధానాల‌తో కూడిన అవార్డుల ప్ర‌క‌ట‌న‌ను , పూర్తి వివ‌రాల‌ను తెలంగాణ ఫిలిం డెవ‌లప్మెంట్ కార్పొరేష‌న్ ద్వారా నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు. ప్ర‌స్తుతం ఉగాది సంద‌ర్బంగా ఇవ్వాల‌ని అనుకున్నామ‌ని, కానీ స‌మ‌యం స‌రి పోవ‌డం లేద‌న్నారు. క‌నీసం 30 రోజుల స‌మ‌యం కావాల్సి వ‌స్తుంద‌న్నారు.

Also Read : Dilruba – Court Movies Sensational :14న ప‌లు సినిమాలు రిలీజ్

Gaddar AwardsTG GovtUpdatesViral
Comments (0)
Add Comment