Anant Ambani : ముఖేష్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం శుక్రవారం (జూలై 12) ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ మెగాస్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సుందరమైన జంట సంప్రదాయ దుస్తులను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.
Anant Ambani Wedding
అనంత్ అంబానీ వివాహానికి సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితారతో హాజరయ్యారు. పొడవాటి జుట్టు మరియు నలుపు సాంప్రదాయ దుస్తులతో మహేష్ బాబు అందంగా మరియు కొత్తగా కనిపించాడు. టాలీవుడ్ స్టార్ మరియు హీరో దగ్గుబాటి రానా తన భార్య మిహికాతో కలిసి అనంత్ అంబానీ(Anant Ambani)-రాధిక మర్చంట్ వివాహానికి హాజరయ్యారు. హీరో వెంకటేష్ కూడా తెల్లటి షేర్వాణీ ధరించాడు.
ఇక యువ హీరో అక్కినేని అఖిల్ పెళ్లి వేడుకలో నల్లటి దుస్తుల్లో అబ్బురపరిచాడు. ఇక కోలీవుడ్ రజనీకాంత్ ఈ వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. అనంత్ అంబానీ వివాహానికి నయన తార విఘ్నేష్ శివన్, సూర్య జ్యోతిక కూడా హాజరయ్యారు. వీరితో పాటు దక్షిణాదికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
Also Read : Sundeep Kishan : తన రెస్టారెంట్ పై వస్తున్న విమర్శలపై స్పందించిన సందీప్ కిషన్