Gaddar Awards: తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘గద్దర్ అవార్డ్స్’ ప్రధానోత్సవంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. గద్దర్ పేరిట చిత్ర పరిశ్రమకు పురస్కారాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించినా కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసారు. దీనిపై వెంటనే స్పందించిన మెగాస్టార్ చిరంజీవి ప్రతిభావంతులకు ‘గద్దర్ అవార్డ్స్’ ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనని ప్రతిష్ఠాత్మకంగా భావించి, అందుకు సంబంధించిన కార్యచరణని మొదలు పెట్టాలని చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలికి సూచిస్తూ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసారు.
Gaddar Awards..
దీనితో చిరంజీవి పోస్ట్ పై స్పందించిన…తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, గద్దర్ అవార్డులపై తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ)తో చర్చించామని తెలిపాయి. గద్దర్ అవార్డుల(Gaddar Awards) కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఎఫ్‌డీసీని కోరామని పేర్కొన్నాయి. కమిటీ ద్వారా విధి విధానాలను రూపొందించి ఎఫ్‌డీసీ ద్వారా ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించాయి.
చిరు సూచనతో రంగంలోకి దిగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలన చిత్ర నిర్మాత మండలి వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ప్రజా గాయకుడు ‘గద్దర్’ పేరిట అవార్డులు ఇస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలిపింది.త్వరలోనే గద్దర్ అవార్డ్స్(Gaddar Awards) పై విధి విధానాలను రూపొందించి సీఎం రేవంత్ గారికి అందచేస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపింది.
గద్దర్ అవార్డ్స్ పేరిట ప్రతి సంవత్సరం అవార్డ్స్ ప్రకటించడం పట్ల ఫిలిం ఇండస్ట్రీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్‌కు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయడంపై చర్చించడం జరిగిందని తెలిపారు. గద్దర్(Gaddar) అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను (ఎఫ్‌డీసీ) కోరినట్లు పేర్కొన్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్తంగా ఒక కమిటీని నియమిస్తామని వెల్లడించారు. త్వరలోనే విధివిధానాలు రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని లేఖ విడుదల చేశారు.
Also Read : Kingdom of the Planet of the Apes: ఓటీటీలోకి కింగ్‌డమ్ ఆఫ్ ది ఫ్లానెట్ ఆఫ్ ది ఏప్స్ !