Bharateeyudu 2: స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2(Bharateeyudu 2)’. సమకాలీన సామాజిక సమస్య లంచం ఇతివృత్తంగా సరిగ్గా 27 ఏళ్ళ క్రితం శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ కు సీక్వెల్ గా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో కాజల్ కథానాయిక. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమల్ హాసన్ పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వటానికి రెడీ అయ్యారు. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. జూలై 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు తెలంగాణా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా అదనపు షోలకు, టికెట్ల రేటు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.
Bharateeyudu 2 Got..
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విధించిన షరతు ప్రకారం… డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ మేకర్స్ వీడియో విడుదల చేశారు. అలాగే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఈ చిత్రానికి టికెట్ల రేటును పెంచుకునే వెసులు బాటును కల్పిస్తూ… తాజాగా జీవో విడుదల చేశారు. అంతేకాదు కాదు, ఓ వారం పాటు అదనపు షోకు కూడా అనుమతులిచ్చారు. జీవో ప్రకారం జూలై 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 5వ ఆటకు అనుమతిని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం… మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ రేటును రూ. 75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50లను పెంచుకునేలా అనుమతులను జారీ చేసింది. అయితే సినిమా ప్రారంభానికి ముందు మాత్రం డ్రగ్స్‌పై అవగాహన కల్పించేలా వీడియోను ప్రదర్శించాలనే షరతుతో ఈ అనుమతులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. మరోవైపు ఏపీలోనూ ఈ చిత్రానికి అన్నివిధాలా అనుమతులు లభిస్తాయని డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా నిర్మాత సురేష్ బాబు తెలిపారు.
Also Read : Election: సైలంట్ గా ఓటీటీలో ‘ఎలక్షన్’ సినిమా ! స్ట్రీమింగ్ ఎందులో అంటే ?