Teja Sajja: మెగాస్టార్ చిరంజీవి నటించిన చూడాలని ఉంది సినిమాలో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి… ఓ బేబీ సినిమాతో హీరోగా మారి జాంబి రెడ్డి సినిమాతో ఫరవాలేదు అనిపించి… ‘హను-మాన్’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో తేజ సజ్జా(Teja Sajja). ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘హను-మాన్’ సినిమాతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా వరుస సినిమాలతో బిజీగా మారాడు తేజ సజ్జా. తాజాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పాడు తేజ సజ్జా. మంచు మనోజ్ మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు నటించే అవకాశముంది. వాటిలో ఓ పాత్ర కోసం రితికా నాయక్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Teja Sajja Movie Updates
మాస్ కా దాస్ విష్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రితిక. ఇటీవల నాని ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ కీలక పాత్రలో తళుక్కున మెరిసింది. ఇప్పుడామెను తేజకు జోడీగా ఖరారు చేయనున్నారని తెలిసింది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని… స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీనికి ‘మిరాయ్’ అనే పేరు పరిశీలనలో ఉంది.
Also Read : Priyanka Chopra: రెండు నెలల విరామం తరువాత షూటింగ్ లో పాల్గొన్న ప్రియాంక చోప్రా !