Hero Teja Sajja Mirai :తేజ స‌జ్జా మిరాయ్ మూవీ డేట్ ఫిక్స్

ఆగ‌స్టు 1న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న

Teja Sajja : మిరాయ్ మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. మూవీ మేక‌ర్స్ గ‌తంలో ఏప్రిల్ లో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. కానీ తాజాగా ఏప్రిల్ లో కాకుండా ఆగ‌స్టు 1న రిలీజ్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మిరాయ్ సినిమాలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నారు తేజ స‌జ్జా(Teja Sajja). ఈ సినిమా పూర్తిగా ఫాంట‌సీ యాక్ష‌న్, అడ్వెంచ‌ర్ చిత్రంగా రూపొందించారు.

Teja Sajja Mirai Movie Updates

ఇదిలా ఉండ‌గా సినిమాటోగ్ర‌ఫ‌ర్ నుంచి చిత్ర నిర్మాత‌గా మారిన కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని మిరాయ్ సినిమాకు తొలిసారిగా మిరాయ్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం విశేషం. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. గ‌తంలో తేజ స‌జ్జా న‌టించిన హ‌నుమాన్ చిత్రం దేశ వ్యాప్తంగా హ‌ల్ చ‌ల్ చేసింది. విమ‌ర్శ‌కుల మ‌న్న‌న‌లు పొందింది. భారీ ఎత్తున కోట్లు వ‌సూలు చేసింది.

ఎప్పుడైతే మోదీ కేంద్రంలో కొలువు తీరారో సినిమాల‌లో కూడా హిందూ భావ‌జాలానికి సంబంధించి, చ‌రిత్ర‌, సంస్కృతి, వార‌స‌త్వం, నాగ‌రిక‌త ఉండే క‌థ‌ల‌కు ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ల‌భిస్తోంది. ఇందులో భాగంగా ఆయా సినిమా రంగాల‌కు చెందిన వారంతా మూస ధోర‌ణితో ఫాంట‌సీ, ఆధ్యాత్మిక సినిమాలు రూపొందించ‌డంపై ఫోక‌స్ పెట్టారు.

మిరాయ్ సినిమాను పాన్ ఇండియాగా తీస్తున్నారు. ప‌లు భాష‌ల్లో రానుంది. ఇందులో మంచు మ‌నోజ్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా రితికా నాయ‌క్ క‌థా నాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ ప్ర‌సాద్ నిర్మించారు. హ‌నుమాన్ ఫేమ్ గౌర హ‌రి సంగీతం అందించారు ఈ చిత్రానికి.

Also Read : Beauty Genelia : హ్యాపీ బ‌ర్త్ డే ఫ్లాషు బాయ్

CinemaMiraiTeja SajjaTrendingUpdates
Comments (0)
Add Comment