Tanya Ravichandran: సెన్సార్ పూర్తి చేసుకున్న తాన్య రవిచంద్రన్‌‘రెక్కై ములైత్తేన్‌’ !

సెన్సార్ పూర్తి చేసుకున్న తాన్య రవిచంద్రన్‌‘రెక్కై ములైత్తేన్‌’ !

Tanya Ravichandran: యువ హీరోయిన్‌ తాన్య రవిచంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రెక్కై ములైత్తేన్‌. ఈ సినిమా తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభాకరన్ తన స్వంత బ్యానర్ స్టోన్‌ ఎలిఫెంట్‌ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కించిన ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను సమకూర్చి తొలిసారి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు ‘యూఏ’ సర్టిఫికేట్‌ను మంజూరు చేస్తూ, యువతకు మంచి సందేశం ఇచ్చే చిత్రమంటూ సినిమా బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

Tanya Ravichandran….

ఈ సినిమా గురించి దర్శక నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభాకరన్ మాట్లాడుతూ…‘ఇది పూర్తిగా కాలేజీ యువత నేపథ్యంలో సాగుతుంది. సినిమాను చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు సైతం ఎంతగానో మెచ్చుకున్నారు. నేను సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి, నిర్మించిన తొలి చిత్రం కావడంతో దర్శకత్వం వహించాను. తాన్య రవిచంద్రన్ ప్రధాన పాత్రను పోషించగా… ఇతర పాత్రల్లో జయప్రకాష్‌, నరేష్‌, గజరాజ్‌, జీవారవి, మీరాకృష్ణన్‌లు నటించారు. మరో ఐదుగురు కొత్త నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతున్నారు. నేపథ్య సంగీతం తరణ్‌ కుమార్‌ సమకూర్చగా, పాటలకు దీసన్‌ సంగీతం అందించారు. ఈ సినిమాలోని తొలి సింగిల్‌ను త్వరలోనే విడుదల చేస్తాం అని ఆయన తెలిపారు.

Also Read : Reba Monica John: సూపర్‌ ఛాన్స్‌ కొట్టేసిన సామజవరగమన హీరోయిన్‌ !

KollywoodTanya Ravichandran
Comments (0)
Add Comment