Hero Jayam Ravi : తన పేరును మార్చుకున్న తమిళ స్టార్ హీరో

జయం మువీతో అరంగేట్రం చేసిన రవి.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు..

Jayam Ravi : తమిళస్టార్‌ హీరో జయం రవి షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. తన పేరు మార్చుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేశారు.నిజానికి రవి అసలు పేరు రవి మోహన్‌. ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్ ఎ మోహన్ కుమారుడే ఇతడు. జయం రీమేక్‌ సినిమాలో తొలిసారి నటిచడం, ఆ సినిమా బంపర్‌ హిట్‌ కొట్టడంతో ఆప్పట్నుంచి ఆయన పేరు జయం రవి(Jayam Ravi)గా మారిపోయింది. రవి అన్నయ్య మోహన్ రాజా కూడా ప్రముఖ డైరెక్టర్‌. మోహన్‌ రాజా డైరెక్షన్‌లో జయం రవి పలు మువీల్లో నటించి మెప్పించారు కూడా. హీరో రవి ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ ఇనిస్టిట్యూట్‌లో నటుడిగా శిక్షణ పొందారు. అంతకుముందే రవి(Jayam Ravi) తండ్రి నిర్మించిన రెండు సినిమాలతోపాటు మరో మువీలో బాల నటుడిగా నటించారు. జయం మువీతో అరంగేట్రం చేసిన రవి.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. M. కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, దాస్, బొమ్మరిల్లు వంటి మువీలతో మంచి ఫాంలోకి వచ్చారు. కొన్ని యాక్షన్, కామెడీ మువీలు కూడా చేశారు.

Hero Jayam Ravi Name Change..

2019నుంచి రెండేళ్ల విరామం తీసుకుని 2021లో ‘భూమి’ మువీతో తిరిగి ప్రేక్షకుల ముందుకొచ్చారు. 2022లో మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో కనిపించారు. ప్రస్తుతం థగ్‌ లైఫ్‌ మువీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 2009లో ప్రముఖ టీవీ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తిని రవి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వారిలో ఒకరైన ఆరవ్ ‘టిక్ టిక్ టిక్’లో కూడా నటించారు. అయితే ఈ జంట గతేడాది 15 సంవత్సరాల వైవాహిక జీవితానికి వీడ్కోలు పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్లు బాంబ్‌ పేల్చారు. అప్పట్నుంచి జయం రవి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అయితే సంక్రాంతి పండగ పూట సోషల్‌ మీడియా వేదికగా మరో సంచలన ప్రకటన చేశారు.

సోమవారం(జనవరి 13) విడుదల చేసిన ప్రకటనలో ఇకపై తనను జయం రవి అనే పేరుతో పిలవొద్దని విజ్ఞప్తి చేశారు.రవి, రవి మోహన్‌గా మాత్రమే పిలవాలని వినతి చేశారు.కొత్త సంవంత్సరంలో కొత్త విజన్‌తో, సరికొత్త విలువలతో ముందడుగేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. రవి మోహన్ స్టూడియోస్ స్థాపించి సరికొత్త కథలను సినిమాల రూపంలోకి మీ ముందుకు తీసుకొస్తానని తన ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా రవిమోహన్‌ స్టూడియోస్‌ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్న తన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఫ్యాన్స్ అసోసియేషన్స్ పేరును కూడా రవి మోహన్‌ ఫ్యాన్స్ ఫౌండేషన్‌గా మార్చినట్లు హీరో రవి వెల్లించారు. తన కొత్త జర్నీకి మీ అందరి సహకారం కావాలంటూ విజ్ఞప్తి చేశారు.

Also Read : TTD Tragedy : తిరుమ‌ల‌పై అస‌త్య ప్ర‌చారం బాధాక‌రం

CommentsJayam RaviTrendingUpdates
Comments (0)
Add Comment