Tamannaah : భిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకుంది తమన్నా భాటియా. గ్లామర్ ,రొమాంటిక్, థ్రిల్లర్ , కామెడీ పాత్రలలో నటించింది. ఆ మధ్యన బోల్డ్ సీన్ లో కూడా నటించింది. తాజాగా భక్తురాలి పాత్రలో నటిస్తోంది. ఆ సినిమా పేరు ఓదెల 2. ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. మహదేవ్ కు పరమ భక్తురాలిగా కనిపించనుంది.
Tamannaah Odela 2 Teaser Updates
ఈ సినిమా సంపత్ నంది ప్రొడక్షన్ హౌస్ జనుంచి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం దేశాన్ని భక్తి ప్రధాన , చారిత్రాత్మక ఘటనలకు సంబంధించిన కథలు, సినిమాలు, వెబ్ సీరీస్, సీరియల్స్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో విడుదలైన విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా దుమ్ము రేపుతోంది.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ప్రభాస్ నటించిన కల్కి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీనికి నిర్మాత అశ్వని దత్. ఓం నమః శివాయ అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah)శివ శక్తి లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం ఓదెల 2 సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. యూపీ లోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళా సాక్షిగా ఓదెల్ 2 చిత్రం టీజర్ ను ఈనెల 22న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కుంభ మేళాలో రిలీజ్ చేసిన చిత్రంగా నిలిచి పోనుంది ఓదెల 2.
Also Read : Puri Jagannath Shocking Comment :పూరీ గోలిమార్ సీక్వెల్ కు రెడీ