Tamannaah Bhatia: ‘విజయ్‌’ సినిమాపై తమన్నా షాకింగ్ కామెంట్స్ !

'విజయ్‌' సినిమాపై తమన్నా షాకింగ్ కామెంట్స్ !

Tamannaah Bhatia: సినిమా అనేది జూదం వంటిది. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో… ఏ సినిమా ఫట్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వొచ్చు… భారీ బడ్జెట్, తారాగణంతో అనేక అంచనాల మధ్య విడుదలైన సినిమా డిజాస్టర్ గా కూడా మిగిలిపోవచ్చు. కర్ణుడు చావుకు లక్ష కారణాలు అన్నట్లు… సినిమా హిట్, ఫ్లాఫ్ వెనుక అనేక కారణాలు ఉంటాయి. ఈ కోవలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ‘సురా’. ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. విజయ్ 50వ సినిమాగా వచ్చిన ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్న(Tamannaah Bhatia) నటించింది. విజయ్ సరసన నటించేందుకు అవకాశం రావడంతో అప్పట్లో చంకలు గుద్దుకున్న ఈ మిల్క్ బ్యూటీ… ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిపోవడంతో పదమూడేళ్ళ తరువాత దానిపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం తమన్నా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Tamannaah Bhatia – ‘సురా’ సినిమాపై తమన్నా విమర్శలు !

‘సురా’ సినిమా విడుదలై పదమూడేళ్ళ తరువాత… ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia) మాట్లాడుతూ… ‘సురా’ అనేది ఒక సినిమానా అంటూ హేళనగా మాట్లాడారు. ఆ సినిమాలో నటించి నేను చాలా పెద్ద తప్పు చేసాను. ‘సురా’ సినిమా వర్కౌట్‌ కాదన్న విషయాన్ని… నేను ముందే గ్రహించాను… అయినా తప్పనిసరి పరిస్థితుల్లో అందులో నటించాల్సి వచ్చింది అని తమన్నా అన్నారు. ప్రస్తుతం తమన్నా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న విజయ్… తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమన్నా చేసిన వ్యాఖ్యలపై విజయ్ అభిమానులు గుస్సా అవుతున్నారు.

చిన్న చిన్న సినిమాలో కెరీర్ ను ప్రారంభించి… టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో సైతం టాప్ హీరోయిన్ గా ఎదిగింది తమన్నా. శ్రీ, హ్యాపీడేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఆవారా వంటి చిన్న సినిమాలతో కెరీర్ ను స్టార్ట్ చేసి… రచ్చ, ఊసరవెళ్ళి, బద్రీనాధ్, రెబల్, కెమరామెన్ గంగతో రాంబాబు, బాహుబలి, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలతో టాలీవుడ్, కోలీవుడ్ లోని దాదాపు స్టార్ హీరోలందరితో నటించి దక్షిణాదిలో టాప్‌ మోస్ట్‌ హీరోయిన్‌ గా నిలిచింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ సినిమాలో కూడా నటించడంతో పాటు పలు వెబ్ సిరీసుల్లో నటిస్తూ ఓటీటీల్లో కూడా సందడి చేస్తుంది. జైలర్ సినిమాలో ఆమె పాత్ర పరిధి తక్కువే అయినా… నువ్వు కావాలయ్యా అన్న ఒక్కపాటతో యూట్యూబ్ ను షేక్ చేసింది.

Also Read : Natural Star Nani: ‘OG’ దర్శకుడితో నాని నెక్ట్స్ మూవీ !

SuraTamannaah BhatiaVijay
Comments (0)
Add Comment