Beauty Tamannaah :కిక్కెస్తున్న మిల్కీ బ్యూటీ న‌షా సాంగ్

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న త‌మ‌న్నా

Tamannaah : బాలీవుడ్ , టాలీవుడ్ ల‌లో ఈ మ‌ధ్య‌న ట్రెండ్ మారింది. సినిమాల‌లో హీరోయిన్ల‌తో పాటు స్పెష‌ల్ సాంగ్స్ కు ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. పుష్ప రాజ్ మూవీలో బ‌న్నీతో ఊ అంటావా అంటూ స‌మంత రుత్ ప్ర‌భు ఆడి పాడింది. అది బిగ్ హిట్ గా నిలిచింది. పుష్ప‌2 సీక్వెల్ మూవీలో సుకుమార్ ఏరికోరి ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల‌తో కిస్స‌క్ అంటూ పాడించాడు. ఇది సూప‌ర్ హిట్ గా నిలిచింది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన డాకు మ‌హారాజ్ మూవీలో ప్ర‌త్యేక పాట‌లో త‌ళుక్కున మెరిసింది బాలీవుడ్ న‌టి ఊర్వ‌శి రౌతేలా.

Tamannaah – Nasha Song Viral

ఈ పాట వివాదాస్ప‌దంగా మారింది. నితిన్ రెడ్డి, శ్రీ‌లీల న‌టించిన రాబిన్ హుడ్ మూవీలో స్పెష‌ల్ సాంగ్ తో హోరెత్తించింది కేతికి శ‌ర్మ‌. దీనిపై కూడా కాంట్రావ‌ర్సీ నెల‌కొన్నా సినిమా ఆశించిన మేర ఆడ‌లేదు.
తాజాగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా(Tamannaah) సంచ‌ల‌నంగా మ‌రారు. త‌ను త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన జైల‌ర్ లో స్పెష‌ల్ సాంగ్ లో న‌టించింది త‌ను. కావాల‌య్యా అంటూ ఆడి పాడింది. కుర్ర‌కారును మెస్మ‌రైజ్ చేసింది . అద్భుతంగా ఆడి పాడింది. మూవీ మేక‌ర్స్ సైతం త‌మ‌న్నాను కావాల‌ని తీసుకుంటున్నారు. త‌నను ప్రిఫ‌ర్ చేస్తున్నారు.

తాజాగా త‌ను రైడ్ 2లో ప్ర‌త్యేక‌మైన పాట‌లో న‌టించింది. ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఏకంగా 24 గంట‌ల్లోనే ఈ పాట 12 మిలియ‌న్ వ్యూస్ సాధించ‌డం విశేషం. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో త‌ను హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ ఒక్క సాంగ్ చేసేందుకు గాను భారీ ఎత్తున రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఏకంగా రూ. కోటికి పైగా తీసుకుంద‌ని టాక్.

Also Read : Directors Remuneration Sensational :భారీ పారితోష‌కం ద‌ర్శ‌కుల సంచ‌ల‌నం

CinemaRaid 2SongTamannaah BhatiaTrendingUpdatesViral
Comments (0)
Add Comment