Tamannaah Bhatia: వేసవి ఉష్ణోగ్రతలకు వారం పాటు వెనక్కి వెళ్లిన తమన్నా ‘బాక్‌’ !

వేసవి ఉష్ణోగ్రతలకు వారం పాటు వెనక్కి వెళ్లిన తమన్నా ‘బాక్‌’ !

Tamannaah Bhatia: ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన క్రేజీ సీరీస్ ‘అరణ్మనై’. హారర్‌ కామెడీ జానర్లో తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సిరీస్ నుండి దర్శకుడు సుందర్ సి, తమన్నా భాటియా(Tamannaah Bhatia), రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా ‘అరణ్మనై-4’ ను తెరకెక్కించారు. ఈ సినిమాకు హిప్‌హాప్ తమిళా సంగీతం అందించగా, ఇ కృష్ణమూర్తి సినిమాటోగ్రఫీ, ఫెన్నీ ఆలివర్ ఎడిటింగ్‌ ను పర్యవేక్షిస్తున్నారు. వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీనిని ‘బాక్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను… ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పి సంస్థ ద్వారా ఈ నెలలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ‘బాక్‌’ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన తమన్నా ఫస్ట్‌ లుక్‌, టైటిల్ లుక్, సాంగ్స్ కు మంచి స్పంద వచ్చింది.

Tamannaah Bhatia…

ఖుష్బు సుందర్, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగు తమిళ బాషల్లో ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిది. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని మేకర్స్‌ ప్రకటించారు. వారం ఆలస్యంగా మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనితో వేసవి ఉష్ణోగ్రత ప్రభావంతో ఈ సినిమా వారం రోజుల పాటు వెనక్కి వెళ్ళినట్లు మూవీ మేకర్స్ చెప్తున్నారు. అయితే మే మొదటి వారంలో కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మే 3న వస్తుందా మరల పోస్ట్ పోన్ అవుతుందా అనేది అనుమానంగా ఉంది.

Also Read : Sunny Leone: మరో తెలుగు హర్రర్ సినిమాలో సన్నీ లియోన్ !

RasikhannaTamannaah Bhatia
Comments (0)
Add Comment