Tamannaah Bhatia: ‘ఓదెల 2’ కోసం బోనమెత్తిన మిల్క్ బ్యూటీ తమన్నా !

‘ఓదెల 2’ కోసం బోనమెత్తిన మిల్క్ బ్యూటీ తమన్నా !

Tamannaah Bhatia: తెలంగాణా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ బోనాలు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత ఈ బోనాల పండుగకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణాలో బోనాలు పండుగ జరగుతోంది. ఈ నేపథ్యంలో మిల్క్ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో అశోక్‌ తేజ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓదెల 2’ నుండి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కు కొనసాగింపుగా రూపొందుతోన్న ఈ సినిమాని మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Tamannaah Bhatia….

హైదరాబాద్‌ బోనాలు సందర్భంగా సోమవారం ఈ సినిమా నుంచి కొత్త లుక్‌ను విడుదల చేశారు. అందులో తమన్నా(Tamannaah Bhatia) చీరకట్టులో తలపై బోనం మోస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ మల్లన్న గుడి సెట్‌ లో బోనాల నేపథ్యంలో సాగే క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ షూట్‌ లో తమన్నాతో పాటు 800మంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు.‘‘ఈ సినిమాలోనిపాత్ర కోసం తమన్నా శిక్షణ తీసుకున్నారు. యాక్షన్‌ సన్నివేశాలను ఆమె అద్భు తంగా చేస్తున్నారు’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్‌. సింహ, యువ, నాగమహేశ్, వంశీ, గగన్‌ విహారి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్‌ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా సౌందర్‌ రాజన్‌ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.

Also Read : Meena: మంచు విష్ణును అభినందించిన హోమ్లీ బ్యూటీ మీనా !

Odela 2Odela Railway StationTamannaah Bhatia
Comments (0)
Add Comment