Tamannaah : సినీ పరిశ్రమకు సంబంధించి ట్రెండ్ మారింది. టాప్ హీరోయిన్లు అందాలను ఆర బోసేందుకు రెడీ అంటున్నారు. నో చెప్పడం లేదు. దీంతో దర్శక, నిర్మాతలకు ఖర్చు కూడా తప్పింది. ఎందుకంటే గతంలో స్పెషల్ సాంగ్స్ కోసం ప్రత్యేకంగా వాంప్ నటీమణులు ఉండే వారు. సిల్క్ స్మిత, జ్యోతి లక్ష్మి లాంటి వాళ్లు. కానీ సీన్ మారింది. ప్రేక్షకుల అభిరుచులు మారాయి. వారికి అనుగుణంగా పాత్రలను, పాటలను మార్చేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు.
Tamannaah in Special Song
ఈ సమయంలో తాజాగా మూవీస్ లో ప్రముఖ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్స్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. వారి స్టార్ డమ్ ను , ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఛాన్స్ లు ఇస్తున్నారు. ఈ మధ్యన అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీలో సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది. ఊ అంటావా అనే సాంగ్ . ఇది బిగ్ హిట్ గా నిలిచింది. పుష్ప2 సీక్వెల్ మూవీలో లవ్లీ బ్యూటీ శ్రీలీల కిస్సక్ అనే పాటకు నటించింది. కుర్రకారును కైపెక్కించేలా చేసింది. ఈ తరుణంలో మరో ముద్దుగుమ్మ , మిల్కీ బ్యూటీగా పేరొందిన తమన్నా భాటియా(Tamannaah).
తను కూడా ఓ స్పెషల్ సాంగ్ లో నటించేందుకు ఓకే చెప్పింది. ఆ సాంగ్ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తో జత కట్టనుంది. రైడ్ -2 మూవీలో తను తళుక్కున మెరవనుంది. ఇదిలా ఉండగా గతంలో తను ఇదే హీరోతో హిమ్మత్ వాలా హిందీ రీ మేక్ లో నటించింది. మరోసారి ఐటమ్ సాంగ్ లో నటించనుందని మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ సాంగ్ లో మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఇందులో అజయ్, తమన్నాతో పాటు ప్రముఖ సింగర్ హానీ సింగ్ కూడా పాలు పంచుకుంటాడని బాలీవుడ్ లో టాక్. మొత్తంగా తమన్నా భాటియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారనుంది.
Also Read : Hero Nani-Hit 3 Movie :మే 1న రానున్న నాని హిట్ -3