Tahira Kashyap : బాలీవుడ్ హీరోయిన్ తాహిరా కశ్యప్ మరోసారి క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. గతంలో సోనాలి బెంద్రే, మనీషా కోయిరాలా కూడా క్యాన్సర్ మహమ్మారికి గురయ్యారు. అనుకోకుండా బయట పడ్డారు. దీనికోసం వారు ఎంతో కష్టపడ్డారు. పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. అమెరికాలో వీరు చికిత్స పొందారు. తాజాగా శాండిల్ వుడ్ కు చెందిన సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డారు. మెల మెల్లగా కోలుకుంటున్నారు. ఇప్పటికే క్యాన్సర్ బారిన పడ్డారు తాహిరా కశ్యప్.
Tahira Kashyap Suffer with Cancer
మరోసారి ఆమె బ్రెస్ట్ కు సంబంధించిన క్యాన్సర్ కు గురైనట్లు స్వయంగా భర్త, ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా వెల్లడించారు. 2018లో తన భార్య, రచయిత్రి , చిత్ర నిర్మాత తాహిరా(Tahira Kashyap)కు తొలిసారిగా క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. అప్పటి నుంచి నేటి దాకా చికిత్స తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి యెదలో నొప్పి రావడంతో తిరిగి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేశారు. మరోసారి క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యిందని తేల్చారు. దీంతో అభిమానులు అయ్యో అంటూ , ఆందోళన వ్యక్తం చేశారు.
క్యాన్సర్ లాంటి భూతం వెంటాడినా ధైర్యంగా ఎదుర్కొంది తాహిరా కశ్యప్. 2020లో తను పూర్తిగా క్యాన్సర్ నుంచి బయట పడినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రీమ్ గర్ల్ 2లో నటించింది కూడా. తాజాగా జరిపిన వైద్య పరీక్షల్లో మరోసారి క్యాన్సర్ బారిన పడటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు నటుడు ఆయుష్మాన్ ఖురానా. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా తాహిరా కశ్యప్ కు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని , అయినా ఎక్కడా ఆందోళన చెందడం లేదంటూ పేర్కొన్నాడు.
Also Read : Malavika Mohanan Shocking :ప్రేమకు వయసుతో పనేంటి..?