Tabu : పారితోషికం వ్యత్యాసంపై కీలక వ్యాఖ్యలు చేసిన టబు

Tabu : బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌, టబు జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘ఔర్‌ మే కహా దమ్‌ థా’. నీరజ్‌ పాండే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శుక్రవారం ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బాలీవుడ్‌లో ఉన్న పారితోషికం వ్యత్యాసాలపై టబు స్పందించింది ‘‘ఈ ప్రశ్న తరచూ నటీమణులనే ఎందుకు అడుగుతుంటారు? నిర్మాతలను కూడా అడగొచ్చు కదా! అలాగే, మీకెందుకు ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్‌ ఇస్తున్నారని హీరోలను అడగవచ్చు కదా? అలా చేస్తే ఈ విషయంలో ఎన్నో మార్పులు వస్తాయి’’ అని టబు తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో చాలా చిత్రాలు వచ్చాయి. హిందీ ‘దృశ్యం’ చిత్రాల్లో వీరిద్దరూ కీలక పాత్రలు పోషించారు.

Tabu Comment

మనసుని హత్తుకునే ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ‘ఔర్‌ మే కహా దమ్‌ థా’లో అజయ్‌ దేవ్‌గణ్‌, టబు.. కృష్ణ, వసుధగా నటించారు. చిన్న వయసు నుంచి ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకున్న కృష్ణ, వసుధ ఎందుకు విడిపోయారు? మళ్లీ తిరిగి కలిశారా? లేదా? విడిపోయిన తర్వాత వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.

Also Read : Vishal-High Court : హీరో విశాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

CommentsTabuUpdatesViral
Comments (0)
Add Comment