Taapsee Pannu : బాలీవుడ్ నుంచి మరో లేడీ కూడా పెళ్లికి సిద్ధమైంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఓ బాలీవుడ్ నిర్మాతను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో మరో హీరోయిన్ తాప్సీ(Taapsee Pannu) కూడా 7 అడుగులు వేయడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే పెళ్లికి సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయని వినికిడి. తాప్సీ ఎవరిని పెళ్లి చేసుకుంటుంది?
Taapsee Pannu Marriage Updates
డెన్మార్క్ బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బాయ్‌తో తాప్సీ పదేళ్లుగా ప్రేమలో ఉంది. ఎన్నో ఏళ్లుగా ప్రేమ ప్రయాణం సాగిస్తుంది ఈ జంట. జాతీయ మీడియా కథనాల ప్రకారం పెళ్లి మార్చి నెలాఖరున జరగనుందని సమాచారం. వివాహ వేదిక ఉదయపూర్‌లోని ప్యాలెస్ అని సమాచారం. సిక్కు మరియు క్రైస్తవ సంస్కృతులలో వివాహం జరగనుందట.
ఈ వివాహానికి బాలీవుడ్ స్టార్స్ ఎవరూ హాజరుకావడం లేదని, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. అయితే ఈ పెళ్లి వార్తలపై తాప్సీ మాట్లాడలేదు. మార్చి నెలాఖరున మీ పెళ్లి జరగనుందన్న వార్తల్లో ఎంత నిజం ఉందని తాప్సీ ని అడుగగా, ఆమె ఇలా సమాధానమిచ్చింది “నేను ఇంతకు ముందు నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలపై వ్యాఖ్యానించలేదు.” ఇప్పుడు అలాగే ఉంది, ఎప్పటికీ అలాగే ” అంటూ మతదాటేసారు.
తాప్సీ తన కెరీర్‌ను తెలుగు సినిమాలతో ప్రారంభించింది. అయితే, ఇక్కడ మేకర్స్ ఆమెపై పెద్దగా దృష్టి పెట్టలేదు. బాలీవుడ్‌కి వెళ్లిన ఆమెకు అక్కడ చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా మహిళల కోసం సినిమాల్లో తాప్సీ ఫస్ట్ ఛాయిస్ అయింది. ఆమె ఇటీవల షారుఖ్‌ఖాన్‌తో కలిసి నటించిన ‘డంకీ’ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
Also Read : Half-Lion Movie : ఆహా స్టూడియో లో భారత రత్న పి వి నరసింహారావు బయోపిక్