Taapsee Pannu: తాప్సీ ప్రధానపాత్రలో ‘గాంధారి’ !

తాప్సీ ప్రధానపాత్రలో ‘గాంధారి’ !

Taapsee Pannu: ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి… మొగుడు, మిస్టర్ ఫెర్ఫెక్ట్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన తాప్సీ పన్ను(Taapsee Pannu)… ఆ తరువాత కోలీవుడ్ కి అటు నుండి అటే బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. బాలీవుడ్ లోని బడా హీరోలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటీవలే తన ప్రియుడు డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన మథియాస్‌ బో ను పెళ్ళి చేసుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి… సినిమాల్లో మాత్రం తన జోరు తగ్గించలేదు. ఇటీవలే ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ… మరో సినిమాను ప్రారంభించింది.

Taapsee Pannu Movie Updates

తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న తాజా సినిమాకు ‘గాంధారి’ టైటిల్‌ ఖరారు చేశారు మేకర్స్‌. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవాశిష్‌ మఖిజా దర్శకత్వం వహిస్తున్నారు. ‘గాంధారి’ సినిమాకు కనికా థిల్లాన్ కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు. తల్లీకూతుళ్ల అనుబంధం, ఓ తల్లి ప్రతీకారం అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్‌ సమాచారం.

కాగా తాప్సీ ఓ ప్రధానపాత్రలో నటించి, కనికా థిల్లాన్‌ కథ అందించిన ‘హసీనా దిల్‌రుబా’, ‘ఫిర్‌ ఆయీ హసీనా దిల్‌ రుబా’లకు వీక్షకుల నుంచి మంచిపాజిటివ్‌ రెస్పాన్స్ లభించింది. దీనితో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘గాంధారి’పై బాలీవుడ్‌ లో అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ‘గాంధారి’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ΄ఫ్లాట్‌ ఫామ్‌ లో త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read : Pailam Pilaga: స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ‘పైలం పిల‌గా’ టీజ‌ర్ రిలీజ్ !

GandhariTaapsee Pannu
Comments (0)
Add Comment