Taapsee Pannu: తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో కలర్ యెల్లో ప్రొడక్షన్స్, టి-సిరీస్, ఎరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘హసీన్ దిల్‌రుబా’. మర్డర్ మిస్టరీ కథాంశంతో.. వినీల్ మాథ్యూ తెరకెక్కించిన ఈ సినిమా 2021లో విడుదలై బాక్సాఫీసు దగ్గర మంచి విజయం అందుకుంది. ఓటీటీలో మంచి వ్యూస్ సాధించి తిరుగులేని హిట్ టాక్ ను సంపాదించుకున్న ఈ ‘హసీన్ దిల్‌రుబా’ సీక్వెల్ గా ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’ ను తెరకెక్కిస్తున్నారు. అయితే మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు కనిక థిల్లాన్ నిర్మాతగా వ్యవహరించగా జయ్ ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు.
Taapsee Pannu Movie Updates
ఈ ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’ కు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రాగా… నిర్మాత కనిక థిల్లాన్ తాప్సీ(Taapsee Pannu) అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైందంటూ తన సోషల్ మీడియా ద్వారా సినిమా కు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసింది. ‘ప్రతిభావంతులైన బృందంతో ఈ అద్భుతమైన సినిమాను ముగించినందుకు ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చింది కనిక థిల్లాన్. దీనితో ఈ ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’ విడుదల ఎప్పుడంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో నిర్మాతను ప్రశ్నిస్తున్నారు.
Also Read : Jacqueline Case : ఈడీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు