Taapsee Pannu: ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి… మొగుడు, మిస్టర్ ఫెర్ఫెక్ట్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన తాప్సీ పన్ను… ఆ తరువాత కోలీవుడ్ కి అటు నుండి అటే బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. బాలీవుడ్ లోని బడా హీరోలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఎప్పుడూ ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇచ్చే తాప్సీ(Taapsee Pannu)… సినిమా ఇండస్ట్రీ వారితో రిలేషన్ షిప్ తనకు నచ్చదని అనేక సార్లు కుండ బద్దలు గొట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమె… మథియాస్ బో అనే ప్రముఖ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో తో కలిసి అనేకసార్లు ఫారిన్ ట్రిప్ లు వెళ్లిన తాప్సీ… దాదాపు పదేళ్ళుగా అతనితోనే రిలేషన్ షిప్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానెల్ లో ఆమె తన రిలేషన్ షిప్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
Taapsee Pannu Comment
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ… ‘‘దాదాపు పదేళ్ల నుంచి మథియాస్ తో రిలేషన్‌లో ఉన్నాను. దక్షిణాది నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే అతడితో పరిచయమైంది. అప్పటినుంచి అతడిని వదల్లేదు. అతనికి బ్రేకప్ చెప్పి… వేరే వాళ్లతో రిలేషన్‌లోకి వెళ్లాలనే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే, అతడి వల్ల చాలా సంతోషంగా ఉన్నా’’ అని ఆమె చెప్పింది. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 13 ఏళ్లు అయ్యిందని చెప్పిన ఆమె ప్రేక్షకాదరణ వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని… అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు అని చెప్పారు. ప్రస్తుతం తాప్సీ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. రెండు మూడేళ్లకే బ్రేకప్ చెప్పుకునే రోజుల్లో సుమారు పది సంవత్సరాల పాటు ఓ బ్యాడ్మింటన్ ప్లేయర్ తో రిలేషన్ షిప్ లో ఉండటం తాప్సీ నిబద్దతకు నిదర్శనం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read : Hanuman 1st Week Collections : రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతున్న ‘హనుమాన్’