Taapsee : అంబానీ ఇంట పెళ్ళికి రవకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తాప్సి

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే...

Taapsee : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికల పెళ్లికి హాజరు కాకపోవడంపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘నిజం చెప్పాలంటే వాళ్లు నాకు వ్యక్తిగతంగా తెలియదు. పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకుని ఉంటుంది. ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి, అతిథికి మధ్య కనీసం ఏదో ఒక రకమైన అనుబంధం ఉండాలని నేను భావిస్తాను. అలాంటి వివాహాలకు మాత్రమే హాజరవుతాను’’ అని తాప్సీ అన్నారు.

Taapsee Comment

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.5 వేల కోట్ల ఖర్చుతో జరిగిన ఈ వివాహ వేడుకలో దేశ విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ తదితర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్తరాధితోపాటు దక్షిణాదికి చెందిన స్టార్‌ హీరోహీరోయిన్స్‌ చాలామంది ఈ వేడుకల్లో సందడి చేశారు. తాప్సీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మూడు చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. ‘ ఫిర్‌ ఆయీ హసీనా దిల్‌రుబా’, ‘ఖేల్‌ ఖేల్‌ మే’, ‘వో లడ్కీ హై కహాన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Also Read : Hero Prabhas : కల్కి 2898 AD సక్సెస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన డార్లింగ్

Ananth AmbaniCommentsmarriageTaapsee PannuViral
Comments (0)
Add Comment