SVSC : తెలుగు చలన చిత్ర రంగంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో రిలీజై హిట్ కొట్టిన చిత్రాలతో పాటు ఆదరణ పొందిన మూవీస్ ను కూడా నిర్మాతలు తిరిగి రిలీజ్ చేయడం, మరికొన్నింటిని ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ చేసేందుకు ఉత్సుకుత చూపిస్తున్నారు. అలాంటి వాటిలో అత్యంత జనాదరణ పొందిన మూవీగా పేరు పొందింది ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్, సమంత రుత్ ప్రభు, అంజలి కలిసి నటించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(SVSC).
SVSC Re-Release Updates
వీరితో పాటు ప్రధాన పాత్రల్లో ప్రకాశ్ రాజ్, జయసుధ నటించారు. సంగీత పరంగా , కథా పరంగా ఇంటిల్లిపాదిని తెలుగు వారందరినీ అలరించింది. మనసు దోచుకుంది. ఈ చిత్రాన్ని మల్టీ స్టారర్ గా తీశారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఇటీవలే ఆయన ఓ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు తండ్రి పాత్రలో రజనీకాంత్ ను అనుకున్నామని , కథ కూడా చెప్పామని కానీ ఓకే చెప్పలేదన్నారు. దీనికి కారణం తను అనారోగ్యంతో ఉండడమేనని పేర్కొన్నారు.
తాజాగా చిత్ర నిర్మాత దిల్ రాజు మరోసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును రీ రిలీజ్ చేశారు. మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను చూసేందుకు ఇప్పటికే టికెట్లు ఫుల్ గా అమ్ముడు పోయినట్లు ప్రకటించారు నిర్మాత. ఈ సినిమా గతంలో 2013లో విడుదలైంది. అప్పట్లోనే ఊహించని రీతిలోనే రూ. 100 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఆనాడు అది రికార్డు. ఇప్పుడు మరో చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యింది.
Also Read : Hero R Madhavan Test :మాధవన్..నయన్ టెస్ట్ ఓటీటీలో రెడీ