Popular Actress Sushmita Sen :స‌రైన వ‌రుడి కోసం వేచి చూస్తున్నా

వివాహంపై సుస్మితా సేన్ కామెంట్

Sushmita Sen : బాలీవుడ్ న‌టి, మాజీ మిస్ యూనివ‌ర్స్ సుస్మితా సేన్(Sushmita Sen) మ‌ళ్లీ పెళ్లికి సిద్దం కావాల‌ని అనుకుంటోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెష‌న్ నిర్వ‌హించింది. ఇందులో ఫ్యాన్స్ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానాలు ఇచ్చింది. మీరు ఎందుకు సింగిల్ గా ఉంటున్నార‌ని అడుగ‌గా అలాంటిది ఏమీ లేద‌ని త‌న మ‌న‌సు ఎప్పుడూ న‌వ య‌వ్వ‌నంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.

Sushmita Sen Comments

అయితే చాలా రోజుల నుంచి నిరీక్షిస్తున్నా..కానీ స‌రైన వ‌రుడు దొర‌క‌డం లేద‌ని తెలిపింది. అందుకే వెయిట్ చేస్తున్నాన‌ని చెప్పింది. నేను కూడా పెళ్లి చేసుకోవాల‌ని ఉంది. అన్వేష‌ణ కొన‌సాగుతోంద‌ని, త‌న‌కు న‌చ్చే వాడి కోసం ఎన్ని రోజులైనా వేచి ఉంటాన‌ని పేర్కొంది సుస్మితా సేన్.

పెళ్లి అంటే కొంద‌రి మెప్పు కోస‌మో, లేదా ప్ర‌ద‌ర్శించ‌డం కోసమో కాదు. రెండు హృద‌యాలు క‌ల‌వాలి. న‌మ్మ‌కంతో కూడుకున్న‌ది మ్యారేజ్. దీనిని నిలుపు కోవాలంటే చాలా క‌ష్ట ప‌డాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది బాలీవుడ్ న‌టి.

ఇదిలా ఉండ‌గా సుస్మితా సేన్ గ‌తంలో మోడ‌ల్ రోహ్మాన్ షాల్ తో రెండున్న‌ర ఏళ్ల పాటు డేటింగ్ చేసింది. ఇద్ద‌రి మ‌ధ్య 15 ఏళ్ల అంత‌రం ఉంది. అయినా బ‌ల‌మైన బంధాన్ని కోరుకున్నారు. 2021లో వారు విడి పోయారు.

2022లో ఐపీఎల్ ఫౌండ‌ర్ ల‌లిత్ మోడీతో జ‌త క‌ట్టింది. త‌ను కూడా బెట‌ర్ హాఫ్ అంటూ తెలిపాడు. ఆ త‌ర్వాత విడి పోయారు. త‌న బ‌యో నుండి సుస్మితా సేన్ పేరును తొలగించాడు. దానిపై స్పందించిన సేన్ అది ఒక క‌ల అని పేర్కొన్నారు.

Also Read : Sonakshi Sinha Sensational :మా బంధానికి మ‌తం అడ్డంకి కాదు

CommentsmarriageSushmita SenViral
Comments (0)
Add Comment