Sushmita Sen: మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ అంటే తెలియనివారు ఉండరు. 1990ల్లో స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత ప్రతిష్టను పెంచింది. మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా సుస్మిత రికార్డ్ క్రియేట్ చేసింది. సుస్మిత సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా చేసింది.
Sushmita Sen Comment
అయితే తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ బయోలో కీలక మార్పులు చేసింది. ఏకంగా తన రెండో పుట్టినరోజు అంటూ బయోలో రాసుకొచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో అదేంటని ఆరా తీసిన నెటిజన్స్ కు ఆశక్తికరమైన విషయాన్ని చెప్పింది ఈ మాజీ విశ్వసుందరి.
గతేడాది సుస్మితా సేన్(Sushmita Sen) గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2023లో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆమె… ఆ తర్వాత కోలుకుంది. అందుకే తాజాగా ఆమె తన ఇన్‌స్టా బయోలో బర్త్ డే తేదీని రాసుకొచ్చింది. నా రెండో పుట్టిన రోజు ఇదేనంటూ… 27 ఫిబ్రవరి 2023 అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే గుండెపోటు నుంచి కోలుకున్న సుస్మితా… తనకు పునర్జన్మగా భావించి ఆ తేదీని అలా రాసుకొచ్చినట్లు తెలుస్తోంది.
1975 నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో సుస్మితా సేన్(Sushmita Sen) జన్మించింది. తండ్రి షుబీర్ సేన్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేయగా, తల్లి శుభ్రా సేన్ నగల డిజైనర్. సుస్మిత హైదరాబాద్ లో జన్మించినా చదువంతా ఢిల్లీలో సాగింది.తెలుగులో నాగార్జున సరసన ‘రక్షకుడు’ చిత్రంలో నటించింది. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్ థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. 2015 లోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సుస్మితా సేన్… ఓటీటీ కోసం ఆర్య, తాళి వంటి వెబ్ సీరిస్‌లలో నటించింది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సుస్మితా సేన్ చివరిసారిగా ఆర్య సీజన్ 3లో కనిపించింది.
Also Read : Mrunal Thakur : కల్కిలో అతిథి పాత్రలో అలరించిన మృణాల్