38 భాషల్లో ‘సూర్య’ కొత్త సినిమా !
Surya’s Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేదాళం, వివేగం, విశ్వాసం, అన్నాత్తే వంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ శివ (సిరుతై శివ) దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 38 భాషల్లో ఈ ‘కంగువా(Kanguva)’ సినిమాను విడుదల చేస్తున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసాయి.
Surya’s Kanguva – ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 38 భాషల్లో ‘కంగువా’
‘కంగువా’ను ఉద్దేశించి చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 38 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఐమ్యాక్స్, 3డీ వెర్షన్ లో కూడా నిర్మించబోయే ఈ సినిమా కోలీవుడ్ స్థాయిని మరింత పెంచేలా ఉండబోతుంది’’ అని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వివిధ సోషల్ మీడియా వేదికలపై వైరల్‌గా మారాయి. నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచేస్తున్నాయి. మరోవైపు ఈయన వ్యాఖ్యలపై సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రిలీజ్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు.
2024 ఏప్రిల్ లో ‘కంగువా’ ?
కంగ అనే ఓ పరాక్రముడి కథతో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమాగా ‘కంగువా’ ను చెబుతున్నారు. దిశా పఠానీ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో, జగపతి బాబు, యోగిబాబు, తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా… వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆఖరి దశలో ఉంది. క్లైమాక్స్ లోని కీలక యాక్షన్ సీక్వెన్స్‌ను థాయిలాండ్‌లోని అడవిలో ఇటీవలే పూర్తి చేసినట్లు సమాచారం..
Also Read : Guntur kaaram : గుంటూరుకారం నుంచి అదిరిపోయే న్యూస్